త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ఈ పంచ్ మాస్టర్ సినిమాలు ఎక్కువగా ఒకే జానర్ లో ఉంటాయనే అభిప్రాయం కూడా ఉంది. జనాలు త్రివిక్రమ్ ను ఎక్కువగా ఫ్యామిలీ డైరెక్టర్ గానే చూస్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ ఇమేజ్ కు భిన్నంగా కొత్త రూట్ లోకి వెళ్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గానే తెరకెక్కుతాయి. ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా.. పంచ్ డైలాగులు పేల్చినా జానర్ మాత్రం దాటడు. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ టచ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ పూర్తయ్యాక వీళ్ల ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత వీళ్లిద్దరు కలిసి చేయబోతున్న ఈ మూవీ పొలిటికల్ యాంగిల్ లో ఉంటుందనే టాక్ వస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడే ఈ మూవీపై బజ్ పెరిగిపోతోంది. 

 

జానియర్ ఎన్టీఆర్ కలెక్షన్ల గురించి ఎంత మాట్లాడతారో.. అతని పొలిటికల్ ఎంట్రీ గురించి అంతే చర్చలు జరుగుతాయి. ఓ ప్రధాన పార్టీకి నాయకత్వం వహిస్తాడనే టాక్ ఉంది. దీంతో త్రివిక్రమ్ పొలిటికల్ యాంగిల్ లో సినిమా అనగానే.. అందరి అంచనాలు అటువైపే వెళ్తున్నాయి. మరి త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాలో లాగా ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రస్తావిస్తారా.. లేక పొలిటికల్ సెటైర్ చేస్తారా అనేది చూడాలి. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇపుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల కోసం సినీ లవర్స్ కళ్లకు ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తారంటే ఆయన టాలెంట్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇపుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారట. అదీ పొలిటికల్ యాంగిల్ లో తీయబోతున్నారనే టాక్ వినిపిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: