కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది. వెంకటేష్ హీరోగా నటించిన 'గురు' వంటి సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్..  పైలెట్ జీ.ఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. సూర్య ఇంటెన్స్ నటనతో పాటు.. ఈ సినిమాలో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రోల్ ఆసక్తిని రేకెత్తిస్తాయని, అంచనాలను పెంచుతాయని తెలుస్తోంది. ఒక సాధారణ పైలెట్ ఎయిర్ డెక్కన్ విమానయాన కంపెనీ అధినేతగా ఎదిగే క్రమంలో ఎదురైన ఛాలెంజెస్ ని తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ ఆర్.ఆర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని కోలీవుడ్ మీడియా సంచారం.

 

తాజాగా ఈ సినిమా నుంచి 'పిల్లా పులి' అంటూ సాగే సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ పాటలో సూర్య - అపర్ణ బాలమురళి మధ్య రొమాన్స్ ఓ రేంజులో పండిందని సూర్య ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ పాటలో ప్రేమ భావనలకు సంబంధించిన అందమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక చాలావరకు స్లో మోషన్ షాట్స్ తో సాంగ్ ఆద్యంతం కనిపించాయి. సూర్య .. తన ప్రియురాలు అపర్ణ బాలమురళి మధ్య అనుబంధానికి సంబంధించిన డ్యూయెట్ గా చిత్రీకరించారు. జీ.వి.ప్రకాష్ కంపోజ్ చేసిన ట్యూన్ మెలోడియస్ గా ఉంటూ ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పెద్ద అస్సెట్ అని సాంగ్ బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.

 

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. సమ్మర్ లో సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. అయితే గత కొంతకాలంగా సూర్య వరుస ఫ్లాప్ లతో సతమమవుతూ కెరీర్ ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో బయోపిక్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా హిట్ అయి మళ్ళీ సూర్య కి మునుపటి క్రేజ్ ని తీసుకు వస్తుందా లేదా అన్నది సినిమా రిలీజైతేగాని తేలదు. కాకపోతే సూర్య మంచి నటుడు కాబట్టి దర్శకురాలిలో సత్తా ఉంది కాబట్టి అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: