టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో హీరోగా మారి తొలి సినిమాతో బెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత అర్జున్ రెడ్డి అనే బోల్డ్ సినిమాలో నటించిన విజయ్, ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తో మరింత పేరు దక్కించుకున్నాడు. ఇక ఆపై పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాతో ఇంకొక బంపర్ హిట్ కొట్టిన విజయ్, ఆ తరువాత నుండి మాత్రం సరైన సక్సెస్ ని కొద్దిరోజులుగా అందుకోలేకపోతున్నాడు. ఇక ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

 

ఇక ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సరసన రాశి హన్నా, ఇజా బెల్లె, క్యాథరీన్ థెరిస్సా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ, పంచె కట్టుకుని, తలకు టవల్ చుట్టుకుని ఒక సాధారణ వ్యక్తిలా ఫంక్షన్ కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక విజయ్ ఇచ్చిన ఆ షాకింగ్ ఎంట్రీ తో ఒక్కసారిగా వేడుక మొత్తం అదిరిపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు హీరోయిన్స్ ఇజా బెల్లె, రాశి ఖన్నా లతో కలిసి ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రాశి మాట్లాడుతూ, తనకు ఒక డాక్టర్ తో డేటింగ్ చేయాలని ఉందని అనడంతో, వెంటనే అందుకున్న విజయ్, డాక్టర్స్ తో డేటింగ్ అంటే వాళ్ళు నిన్ను కొంత డిఫరెంట్ గా చూస్తారు. 

 

నీ ఎర్రని బుగ్గలు చూసి అతనికి మాంసం మాదిరిగా అనిపిస్తుంది, ఇక నీ యద అందాలు చూసి అతడికి మరోలా ఫీలింగ్ కలుగుతుంది అని అంటుండగానే రాశి అందుకుని, నీకు ఇంకా అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఛాయలు పోయినట్లు లేవు విజయ్ అనడంతో, యాంకర్ సహా హీరోయిన్లు ఇద్దరూ కూడా కొంత సిగ్గుతో నవ్వుతారు. అయితే ఈ ఘటనతో విజయ్ పై కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. నువ్వు ఫంక్షన్ కి పంచె ఎగ్గట్టుకు రావడం తప్పు కాదు, కానీ ఇలా అమ్మాయిల ప్రైవేట్ పార్ట్శ్ పై పంచ్ లు వేయడం మాత్రం తప్పు బాసు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: