రవితేజ హీరోగా తెరకెక్కిన కిక్ సినిమాకు తన అదరగొట్టే సాంగ్స్ ని అందించి సంగీత దర్శకుడుగా టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి తనపై పడేలా చేసుకున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన థమన్, అప్పట్లో మిరపకాయ్, దూకుడు, బిజినెస్ మ్యాన్, పండగ చేస్కో, రేస్ గుర్రం వంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్, ఆ తరువాత మరింత దూకుడుతో దూసుకుపోయాడు. 

 

కాగా రాను రాను అప్పట్లో థమన్ మ్యూజిక్ పై కొన్ని ట్యూన్స్ కాపీ అనే ముద్ర పడడంతో ఆపై కొంత గ్యాప్ తీసుకున్న థమన్, ఆ తరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మహానుభావుడు, తొలిప్రేమ, భాగమతి, అరవింద సమేత సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని తన పేరు మళ్ళి మారుమ్రోగేలా చేసుకున్నాడు. ఇక ఇటీవల బన్నీ, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాకు అత్యద్భుతమైన సాంగ్స్ అందించి తన పేరు బాలీవుడ్ రేంజ్ కి వినపడేలా చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పింక్ సినిమా తెలుగు రీమేక్ ద్వారా తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్, ఈ సినిమాలోని సాంగ్స్ తో అదరగొడతానని ఇటీవల పవన్ ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. 

 

ఇక అనుకున్న విధంగానే ఇటీవల అలవైకుంఠపురములో సినిమాలోని సామజవరగమనా సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్ తో ఈ సినిమాలో ఒక పాట పాడిస్తున్నట్లు నేడు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు థమన్. అయితే ఆ వార్తతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ లో ఆనందం విపరీతంగా వెల్లివిరిసింది. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం, బన్నీకి బాగా అదరగొట్టే సాంగ్స్ ఇచ్చావు, మరి మా పవన్ సినిమా సాంగ్స్ ని అయితే పడుకోబెట్టవు కదా అంటూ అనుమానంతో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి థమన్ ఈ సినిమాకు అందించిన సాంగ్స్ అదిరిపోయాయని టాక్. మరి మే వరకు వెయిట్ చేస్తేనే కానీ థమన్ ఈ సినిమాకు అందించిన మ్యూజిక్ రేంజ్ ఏంటో చెప్పలేం....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: