టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు సినిమాతో టాలీవుడ్ నటుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృష్ణ, ఆ తరువాత కన్నె మనసులు, గూఢచారి 116, సాక్షి తదితర సినిమాల్లో నటించి మంచి పేరు గడించారు. ఇక అక్కడి నుండి వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న కృష్ణ, అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఇక కృష్ణ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. 

 

ఆయన టాలీవుడ్ కి అప్పట్లో సరికొత్త హంగులను తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర వహించారు. ఇక ఏదయినా సినిమాని ఖర్చుకు వెనకాడకుండా తీయాలంటే అప్పట్లో కృష్ణ అందరికంటే ముందుగా డేరింగ్ గా డాషింగ్ గా ఉండేవారు. ఆ విధంగా తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ పై అత్యంత భారీ ఖర్చుతో సింహాసనం అనే సినిమాని 1986లో తీశారు. వాస్తవానికి నేటి బాహుబలి మాదిరిగా అప్పట్లో ఆ సినిమా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిందని, అంతేకాక ఓవరాల్ గా ఆ సినిమా అప్పట్లో నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లు అందుకుని గొప్ప రికార్డ్స్ అందుకుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. 

 

ఇక అదే సినిమాని నేడు తీయాలంటే దాదాపుగా రెండు నుండి మూడు వందల కోట్లు అవుతుందని, అయితే అప్పట్లో తాను ఏ మాత్రం కాస్ట్ విషయంలో ఆలోచించకుండా ముందుకు సాగానని, అయితే ఒకవేళ సినిమా అడకపోతే నిర్మాత నష్టపోవలసి వస్తుందని భావించి, ఆ సినిమాకు దర్శకత్వం తో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నట్లు ఇటీవల కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. కథకుడి దగ్గరి నుండి సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ, సింహాసనం సినిమా విజయం లోఎంతో కీలక పాత్ర వహించారని, అలానే సినిమాకు అద్భుతమైన కథను అందించడంలో త్రిపురనేని మహారథి పడ్డ కష్టం ఎప్పటికీ మరువలేనిదని కృష్ణ చెప్పారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: