రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫైనల్ టార్గెట్ ఏంటన్నది చెప్పేశాడు. శుక్రవారం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ హిట్ కు గురి పెట్టాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కె.ఎస్ రామారావు నిర్మించారు. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమా యూత్ ఆడియెన్స్ చూపిస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉందని అంటున్నాడు విజయ్.

 

తనని అభిమానిస్తూ.. పాజిటివ్ గా ట్రోల్స్ చేస్తున్న వారికి నిద్రలేని రాత్రులు ఇస్తున్నాను.. వారు చేసే ట్రోల్స్ చూస్తే వారి కళ్లల్లో నేను ఉంటానని నాకు అనిపిస్తుందని అన్నారు విజయ్ దేవరకొండ. ఇక ఫైనల్ గా ఇండియన్ సినిమాను రూల్ చేయాలని అనుకుంటున్నా అని తన మనసులోని మాటని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇండియన్ సినిమాను ఏలాలనుకోవడం అంటే అది మాములు విషయం కాదు. పెళ్లిచూపులు, గీతా గోవిందం సూపర్ హిట్ అవగా ఆ తర్వాత నోటా ఫ్లాప్ అయ్యింది. టాక్సీవాలా హిట్ అనిపించుకోగా ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయ్యింది.

 

ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ మీద కూడా హోప్స్ ఉన్నాయి. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమా చేసిన క్రాంతి మాధవ్ మళ్లీ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. తను చెప్పినట్టుగానే నెక్స్ట్ పూరి డైరక్షన్ లో చేస్తున్న సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే తను చెప్పినట్టుగా విజయ్ రేంజ్ ఏంటన్నది నేషనల్ వైడ్ తెలుస్తుంది. పూరి డైరక్షన్ లో తెరకెక్కే సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: