అక్కినేని నాగార్జున అంటేనే అమ్మాయిల మనసు దోచే మన్మధుడు. అందుకే ఆయనకి ఈ ఏజ్ లో కూడా ఏజ్ తో సంబంధం లేకుండా లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఆయన సినిమాలలో రొమాంటిక్ సీన్స్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు లెక్కేలేదు. టాలీవుడ్ లో కింగ్ అయినా మన్మధుడు అయినా ఆయనే. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటికీ నాగార్జున కి ఉన్న క్రేజ్ ఆయన కొడుకులిద్దరికి లేదంటే నమ్మి తీరాల్సిందే. పోటీ పడి ఒకేరోజు నాగార్జున, నాగ చైతన్య , అఖిల్ సినిమాలు గనక రిలీజైతే అసలు ఏమాత్రం ఆలోచించకుండా అందరూ నాగార్జున సినిమాకే ముందు వెళతారు. అలా చూస్తే ఈ ఏజ్ లో కుడుకులకి తండ్రే గట్టి పోటీ అనుకోవాలి. ఇండస్ట్రీలో మరే హీరో కాదు. 

 

అయితే నాగార్జున వయసు రిత్యా ఇప్పుడు ఏ అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి సినిమాలు చేస్తే ఆయన మీద గౌరవం, ఇష్టం, అభిమానం పెరుగుతాయి గాని... మన్మధుడు 2 అంటూ కుర్ర వేశాలేసి అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ లా హీరోయిన్స్ తో రొమాన్స్, లిప్ కిస్సులంటే ఎవరైనా భరిస్తారా..సహిస్తారా. మన్మధుడు 2 సినిమా ట్రైలర్స్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాగార్జున ని ఈ విషయంలోనే జనాలు ఏకిపారేస్తున్నారు. వయసుకి తగ్గ పనులు చేయడం లేదని నిర్మాతగా ఎంతో బాధ్యత మీమీద ఉంటే మీరు ఇలాంటి అడ్డమైన సినిమాలు చేసి మీమీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

 

మన్మధుడు 2 లో నాగార్జున లిమిట్స్ దాటి మరి రకుల్ తో రొమాన్స్ చేశారు. అంతేకాదు గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చిన భామలతోను పెదవిముద్దులతో పిచ్చెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే అందరూ అనుకున్నారు... ఖచ్చితంగా ఈ సినిమా దారుణంగా ఫ్లాపవుతుందని. అనుకున్నట్టుగానే సినిమా నామరూపాల్లేకుండా పోయింది. అందుకు కారణం ఆయన వయసు దృష్ఠిలో పెట్టుకోకుండా పోషించిన పాత్రే. అసలు ఈ సినిమా ప్రివ్యూని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని ఎలా చూశారంటూ ప్రశ్నించిన వాళ్ళు లేకపోలేదు. ఇంత వయసు వచ్చిన మీరే ఇలాంటి చెత్త సినిమాలు తీస్తుంటే మీ కడుపున పుట్టిన మీ కొడుకులు ఎలాంటి సినిమాలు చేస్తారని అడిగుతున్నారట. కొడుకులు ఇలాంటి ఛండాలమైన సినిమాలు చేస్తే మందలించాల్సింది పోయి మీరే ముందు హీరోయిన్స్ తో రొమాన్స్ కి రెడీ అవుతుంటే మీ పిల్లలు మీ దారిలో రాక ఏంచేస్తారని ట్రోల్ చేస్తున్నారు. మరి నాగ్ ఇప్పటికైనా అలాంటి సినిమాలు చేయకపోతే బెటర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: