“కెరీర్‌ స్టార్టింగ్‌లో దక్షిణాదిలో రెండు చిత్రాల్లోంచి నన్ను తీసేసి, వేరే హీరోయిన్లను తీసుకున్నారు. సినిమా నేపథ్యం లేని కారణంగా కొన్ని సినిమాలు నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. మా నాన్న దర్శకుడో, నిర్మాతో అయ్యుంటే..సినీ నేపథ్యం ఉండుంటే..ఆ అవకాశాలు నాకే వచ్చేవేమో… అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మనలో ప్రతిభ ఉంటేనే చిత్ర పరిశ్రమలో ఉండగలం. ఏదైనా రాసి పెట్టుంటే జరుగుతుంది. ‘నన్ను భూమిలో పాతిపెట్టాలని ప్రయత్నించేవాళ్లకు నేనొక విత్తనం అనే సంగతి తెలియదు’ అని ఒక కోట్‌ మా ఇంట్లో ఉంటుంది. నేనిలా చెప్పకూడదు గానీ… ‘ఆ సినిమా నేను చేయాల్సింది’ అనుకున్నవన్నీ సరిగా ఆడలేదు. దాంతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా.


ప్రస్తుతం ప్రేక్షకులు ప్రతిభను చూస్తున్నారు. విక్కీ కౌశల్‌, అనుష్కా శర్మ, తాప్సీ, భూమి పెడ్నేకర్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు సినీ నేపథ్యం నుండి వచ్చినవాళ్లు కాదు. ఎక్కడో ఎవరో ఒకరు వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా పైకి వచ్చారు. ప్రతిభ ఉంటే పైకొస్తారని నా నమ్మకం !”
 

‘‘ప్రపంచంలో అవకాశ వాదం ఎక్కువ. మనిషి నైజమే అంత! అవకాశాల కోసం అర్రులు చాస్తున్నామని ఎదుటివాళ్లకు తెలిస్తే… ‘మాకేంటి?’ అనే ధోరణిలో కొందరు ఉంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ‘వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా?’ అనే నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి అవకాశం ఇస్తుందని ఎవరూ వందకోట్ల సినిమాలో కథానాయికగా తీసుకోరు. అమ్మాయిలను లోబరచుకోవడానికి కొందరు ట్రిక్స్‌ ప్లే చేస్తారు. నేను చెప్పేది ఒక్కటే… అటువంటి ట్రిక్స్‌కి పడవద్దు!


నిజాయతీగా చెప్పాలంటే… హీరోయిన్లు నాజుకుగా కనిపించడం కోసం జిమ్‌కు వెళతాం. చిన్న చిన్న దుస్తులు వేసుకోవడం కోసం, డ్యాన్స్‌ చేయడం కోసం చాలా కష్టపడతాం. సినిమా కోసం కెమేరా ముందు, వెనుకా అదనంగా ఎంతో శ్రమిస్తాం. కానీ, సినిమా హిట్టయితే ‘గోల్డెన్‌ లెగ్‌’ అంటారు. ఫ్లాప్‌ అయితే ‘ఐరన్‌ లెగ్‌’ అంటారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో నేను చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. నా దృష్టిలో ఇవన్నీ మూఢ నమ్మకాలు. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు’’

మరింత సమాచారం తెలుసుకోండి: