పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడమే చాల కష్టం అని అనుకునే పరిస్థితులలో ఇప్పుడు ఏకంగా ఒకేసారి పవన్ రెండు సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా ఆ రెండు సినిమాల షూటింగ్ ను పరుగులు తీయించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘పింక్’ రీమేక్ కు పవన్ రోజులు వారీగా కాల్ షీట్స్ ఇస్తే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మూవీకి పవన్ గంటల వారీగా కాల్ షీట్స్ ఇచ్చి ఆరోజుకు అతడి పనుల ఒత్తిడిని బట్టి తనకు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు క్రిష్ మూవీ కోసం పని చేస్తాను అని మాట ఇచ్చినట్లు సమాచారం. 

 

అయితే క్రిష్ తీస్తున్నది ఒక పీరియడిక్ మూవీ దీనికోసం పవన్ ప్రత్యేకమైన గెటప్ తో కనిపించవలసి ఉంటుంది. దీనికితోడు ఈ మూవీలో అలనాటి చారిత్రక నేపద్యం ఉన్న పరిస్థితులు కనిపించాలి కాబట్టి సెట్స్ తో పాటు భారీ లైటింగ్ అడ్జెస్ట్ మెంట్ కూడ చాల అవసరం. దీనితో ఒక సీన్ పూర్తి అయ్యే సరికే గంటల కాలం గడిచిపోతున్న పరిస్థితులలో పవన్ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ మూవీ సెట్స్ లో ఉంటూ ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూ ఆ విషయాలు సద్దుబాటు చేయమని చెపుతూ ఉండటంతో అసలే రోజుల లెక్కన పారితోషికం ఇస్తున్న నిర్మాతలకి పవన్ కళ్యాణ్ ధోరణితో చుక్కలు కనపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి పవన్ తనకు చాల సన్నిహితంగా ఉండే దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తాడు. అయితే క్రిష్ కు పవన్ కు పెద్దగా సాన్నిహిత్యం లేకపోవడం ఈ మరొక సమస్యగా మారింది అని అంటున్నారు. ఈ సినిమా క‌థ కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరుగుతుందని టాక్. 


కాక‌తీయ సామ్రాజ్యంపై దాడి చేసిన అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ వ‌జ్రాన్ని ఎత్తుకెళ్లాడు. ఆ త‌ర‌వాత బాబర్ చేతికి వ‌చ్చింది. అటు పిమ్మ‌ట ఈ వ‌జ్రం చేతులు మారుతూ బ్రిటీష్ వారి చేతిలోకి వెళ్లిపోయింది. 1850 నుంచి ఈ వజ్రం ఇంగ్లండ్‌లోనే ఉండిపోయింది. అయితే 1850కి ముందు ఈ వ‌జ్రం కాజేయ‌డం కోసం కొంత‌మంది బందిపోటు దొంగ‌లు ప్ర‌య‌త్నించిన‌ట్టు ఒక క‌థ అల్లి క్రిష్సినిమా తీస్తున్నాడు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి. ఈ సినిమా కోసం ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో క్రిష్ ఉన్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీకి పవన్ రేంజ్ కి మించిన బడ్జెట్ ఖర్చు పెడుతున్న పరిస్థితులలో పవన్ ఇలా నిరంతరం పరధ్యానంగా మూడిగా ఉంటే ఈ మూవీ ఎలా గట్టెక్కుతుంది అన్న టెన్షన్ లో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: