మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్.. ఈ హీరో ఎంట్రీ బాగానే జరిగింది కానీ ఒక గట్టి హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు.. ఇప్పటివరకు సాయిధ‌ర‌మ్‌తేజ్ చేసిన సినిమాలు ఫర్వాలేదనిపించాయో గానీ వసూళ్ల పరంగా టాలీవుడ్ చరిత్రను తాకలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఒకగానొక దశలో వరుస ఫ్లాపులతో తన మార్కెట్ తగ్గిపోయింది. అయినా బ్యాలన్స్ చేసుకుంటూ ఏదోలా నెట్టుకొస్తున్న దశలో సాయిధ‌ర‌మ్‌తేజ్ కు బూస్ట్ లాంటి సినిమా దొరికింది. ఆ చిత్రమే చిత్ర ల‌హ‌రి..

 

 

ఈ చిత్రంతో పోయిన ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. ఆ తర్వాతప్ర‌తిరోజు పండ‌గే చిత్రం సూప‌ర్‌హిట్ గా నిల‌వ‌డంతో సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. అదే ఊపుతో సాయి తేజ్ చేస్తున్న తాజా ప్రయత్నం. సోలో బ్రతుకే సో బెటర్. ఇప్పటికే టైటిల్ సహా పోస్టర్లకు స్పందన బావుంది. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా చిత్ర యూనిట్ మూవీ థీమ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ టీజర్ కొన్ని సెకన్ల పాటు సాగినా.. అందులో సాయి తేజ్ డైలాగ్ మురిపించింది. కష్టం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఓ ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి? అంటూ సాయితేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

 

 

సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్ వీకెండ్ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ అసలు సినిమా థీమ్ ఏమిటో రివీల్ చేసేశారు. ఇక నేపథ్యంలో మదర్ థెరీసా.. వాజ్ పేయ్..లతాజీ లాంటి ప్రముఖుల ఫోటోల్ని చూపించి సోలో లైఫ్ లో మహనీయులు అన్న మీనింగుని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదో పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. ఎంతో ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎలిమెంట్ ఉన్న ఈ వీడియో యువతరంలోకి దూసుకెళుతోంది.

 

 

ఇకపోతే  ఈ చిత్రంతో దర్శకుడిగా సుబ్బు పరిచయమవుతుండగా, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా హిట్ తృఆక్‌లో పడితే సాయిధ‌ర‌మ్‌తేజ్ హ్యట్రిక్ కొట్టినట్లే. మరి ఇలా వరుసగా మూడో హిట్ ఇచ్చి తన మార్కెట్‌ను పెంచుకుంటాడా లేడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగవలసిందే.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: