తెలంగాణా స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, యంగ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకి శుక్రవారం వచ్చింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ కూడా పడిపోయాయి. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీస్ తీయడంలో సిద్దహస్తుడు అయిన క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో లవ్ స్టొరీ ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

 

దానికి తోడు సినిమా ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్ లుక్స్ అన్నీ కూడా సినిమా క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. విజయ్ యాటిట్యూడ్ కి ఫాన్స్ ఉంటారు కాబట్టి ఈ సినిమాను అందరు హీరోల అభిమానులు చూస్తారు. ఇక ఈ సినిమా టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. సినిమాలో ప్రతీ సీన్ కూడా చాలా బాగా తీసారని అంటున్నారు. ముఖ్యంగా విజయ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారట. 

 

అయితే కొంత మందికి సినిమా నచ్చకపోవచ్చు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ సినిమాకు హైలెట్ అని కొందరు అంటున్నారు. మరికొందరు ఫస్టాఫ్ ఆకట్టుకోలేదు అంటున్నారు. ఇక అర్జున్ రెడ్డి రేంజ్ లో విజయ్ నటన ఉందని, యూత్ కే కాకుండా, కుర్ర తనంలో లవ్ స్టోరీస్ నడిపిన కొందరు అంకుల్స్ కి కూడా సినిమా నచ్చుతుందని అంటున్నారు. ఇక హీరోయిన్ల నటన విషయానికి వస్తే, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ దుమ్మురేపారని అంటున్నారు. ఈ నలుగురే సినిమాను ముందుండి నడిపించారని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను చూడవచ్చని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: