పవన్ కళ్యాణ్ కు దేముడు ఇచ్చిన తమ్ముడుగా నితిన్ పవన్ అభిమానుల మధ్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. దీనికి తగ్గట్టుగా నితిన్ కూడ తనకు ఏమాత్రం అవకాశం వచ్చినా తాను పవన్ వీరాభిమానిని అని చెప్పుకునే విధంగా ప్రవర్తిస్తూ అనునిత్యం పవన్ అభిమానులకు కనెక్ట్ అవడానికి ప్రవర్తిస్తూ ఉంటాడు.


ఇలాంటి నితిన్ తన రూట్ మార్చి ఇప్పుడు ఒకప్పటి అందాల హీరో శోభన్ బాబు లుక్ ను అనుసరించడం పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా పాత విషయాలు అన్నీ ఇప్పుడు మళ్ళీ సినిమాలలో చూపెడుతున్నారు. ఒకప్పటి యువతరం మోజుగా పెంచుకున్న హిప్పీ హెయిర్ స్టైల్ అలాగే ఒకనాటి బెల్ బోటమ్ ప్యాంట్ లను నేటి తరం హీరోలకు ఆ సినిమాల కథలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో వేస్తున్నారు.


ఇలా ఓల్డ్ స్టైల్ కాస్ట్యూమ్స్ లో ఈమద్య కాలంలో పలువురు హీరోలు అనేక సినిమాలలో కనిపించారు. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నితిన్ కూడ ఇదే పద్ధతిని వచ్చే వారం విడుదల కాబోతున్న తన ‘భీష్మ’ సినిమా కోసం అనుసరించాడు. పాత కాలం హీరోలా  డ్రస్ చేసుకుని పాత తరం వారు వాడిన స్కూటర్ పై చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ స్టిల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా నితిన్ అలనాటి అందాల నటుడు శోబన్ బాబు రింగ్ హెయిర్ స్టైల్ ను అనుసరిస్తూ కనిపిస్తున్న ఈ స్టిల్ ను చూడగానే ఈనాటి తరం ప్రేక్షకులకు కూడ వెంటనే శోభన్ బాబు గుర్తుకు వస్తాడు. 


వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’ ఈనెల 21న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు జరుగుతున్న వాలెంటైన్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ వీడియోను విడుదల చేయబోతున్నారు. వరస పరాజయాలతో సతమతమైపోతున్న నితిన్ కు ఒక మంచి హిట్ కావలసిన పరిస్థితులలో ఈ మూవీ థీమ్ వీడియో ఎంతవరకు యూత్ కు కనెక్ట్ అవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: