మొన్న ఢిల్లీలో ఆమ్‌ ఆధ్మీ పార్టీ విజయం, అంతకు ముందుకు జగన్ విజయం వెనుక ఉన్న వ్యక్తి ప్రశాంత్‌ కిశోర్‌. అయితే జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం ఇలాంటి వ్యూహకర్తల సహాయం తీసుకోరు. వారికీ సొంత వ్యూహాలు ఉంటాయి. వాళ్లకు సొంత కార్యకర్తల బలం ఉంటుంది. వాళ్ల నాయకులు అక్కడి క్షేత్రస్థాయిలో ఉన్న నిజా నిజాలు అధిష్టానం దృష్టి తీసుకెళ్తారు. సొంత ఆలోచనతోనే పార్టీని నడిపిస్తారు. అయితే  నిజాలు వారు అంగీకరించే స్థాయిలో లేనప్పుడు ఫలితాలు మారిపోతాయి.

 

ఇటీవల కేసినేని లాంటి వారి చెప్పిన నిజాలు పట్టించుకోకుండా అధికారుల మాటల విన్న బాబు దెబ్బతిన్నాడు. కాంగ్రెస్‌ పార్టీ కూడా గులాం నబీ ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి వారి మాటలు విని పూర్తిగా నష్టపోయింది. గ్రౌండ్‌ రియాలిటీ తెలియని పెద్దలు చెప్పిన మాటలు నమ్మి ఇక్కడ నష్టపోయింది. అదే సొంత ఆలోచనలో పంజాబ్‌లో పోటి చేసిన కాంగ్రెస్‌ విజయం సాధించింది.

 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత ఎన్నికలో జగన్‌ అంఖడ విజయం సాధించటం, ఆ తరువాత విజయంలో కీలక భూమిక పోషించిన ప్రశాంత్ కిశోర్‌తో సంబంధాలు కొనసాగించటంతో చంద్రబాబు కూడా రాజకీయ వ్యూహకర్తల సహాయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల మీద అధికారిక సమాచారం లేకపోయినా.. మీడియా సర్కిల్స్‌ లో ఈ వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రశాంత్‌ కిశోర్‌ పార్టనర్‌నే బాబు వ్యూహకర్తగా నియమించుకున్నారని, ఇప్పటికే అతనికి దాదాపు 150 కోట్ల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే బాబుకు వ్యూహకర్తగా వ్యవహరంచబోయే వ్యక్తి రాబిన్‌ శర్మ అని తెలుస్తోంది.

 

 ఇన్నాళ్లు ప్రశాంత్ కిశోర్‌ టీంలో పని చేసిన రాబిన్‌ ఇప్పుడు సొంతగా కొంతమంది టీంను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు టీడీపీ తరుపున పని కూడా ప్రారంబించిన ఆయన స్థానిక ఎన్నికల విషయంలో టీడీపీకి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వటం కూడా మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నాలుగేళ్ల పాటు టీడీపీ కోసం పనిచేసేలా రాబిన్‌ శర్మ ఒప్పందం చేసుకున్నాడన్నది పోలికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: