కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన నయనతార తర్వాత తమిళ్ లో రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నయన్ కి వరుస అవకాశాలు దక్కాయి.  మురుగదాస్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ‘గజని’ సినిమాలో నయనతార గ్లామర్ కి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.  ఈ తర్వాత ఎన్నో గ్లామర్ తరహా పాత్రల్లో నటిస్తూ వచ్చిన నయనతార దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  కొంత కాలంగా నయనతార లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. సినిమాల్లో నటించడం వరకే తన పని ప్రమోషన్స్ తాను పట్టించుకోను అంటూ ఈ అమ్మడు ముందే చెప్తుంది. అయినా కూడా ఈమెనే కావాలని చాలా మంది నిర్మాతలు , దర్శకులు ఈమెతో వర్క్ చేస్తున్నారు.

 

అంతే కాదు గ్లామర్ కి కూడా దూరంగా ఉంటూ వస్తుంది.  దాంతో ఆమె గ్లామర్ కి ఫిదా అయ్యే ఆడియన్స్ కూడా సినిమాలకు దూరం అవుతూ వస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడు స్కిన్ షో అంతా ఇంతా కాదు. తమిళ్  బిల్లా సినిమాలో బికీనీతో పిచ్చేక్కించింది.   కాని గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈమె చాలా పద్దతైన కాస్ట్యూమ్స్ మాత్రమే ధరిస్తుంది. దాంతో  ప్రస్తుతం ఈ అమ్మడికి కాస్త ఆఫర్లు తగ్గాయి.  ఈ విషయంలో దర్శక, నిర్మాతలు నయన్ కి చెప్పినా ఏమీ పట్టించుకోకపోవడంతో వారు కూడా వెనుకంజ వేయాల్సి వస్తుందట.

 

తాజాగా  నయనతార పొట్టి డ్రస్ లు వేసుకోవడంతో పాటు రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు మరియు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ ఇంకా ముద్దు సీన్స్ కు కూడా ఓకే అంటుందట.  సినిమాలో పరిస్థితులను కాస్ట్యూమ్స్ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు నయన్ సిద్దం కావడంతో మళ్లీ గ్లామర్ పాత్రల్లో కుర్రాళ్ల మనసు దోచేస్తుందని అంటున్నారు.  అంతేకాదు ప్రమోషన్స్ విషయంలో కూడా తన పద్దతి మార్చుకుంటే బాగుంటుంది కదా అంటూ కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: