టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు తమిళ హీరో సూర్య.  గజిని సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన మొన్నటి గ్యాంగ్ సినిమా వరకు తెలుగు ప్రేక్షకులతో జర్నీ చేస్తూ వస్తున్నారు.  హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు. సామాన్యులకు సైతం విమానయాన సౌకర్యం ఉండాలని కలలుకన్న కెప్టెన్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలోని పిల్ల పులి అనే రొమాంటిక్ సాంగ్ ని విన్నూత్నంగా రిలీజ్ చేశారు.

 

100 మంది పిల్లలు, చిత్ర యూనిట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ ఆకాశంలో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పిల్ల పులి సాంగ్ అద్భుతంగా ఉంది.  ఈ సందర్భంగా సుధ కొంగర మాట్లాడుతూ “సూర్య నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చారు. నా శాయశక్తులా సినిమాను బాగా తీశాను. నా కలం నిజం కావడంలో తోడ్పడిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా థాంక్స్. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా మా నాన్న మరణించారు. మోహన్ బాబు రూపంలో ఒక కొత్త నాన్నను నేను దత్తత తీసుకున్నాను.  నా విషయంలో ఆయన ఎంతో శ్రద్ద చూపించారని అన్నారు. 

 

ఇక సూర్య మాట్లాడుతూ.. కెప్టెన్ గోపీనాథ్ వచ్చి ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశారు. సాధారణ వ్యక్తి కూడా ఆకాశంలో ప్రయాణించగలిగేలా చేశారు. ఈ సినిమాకు వచ్చే పేరు, ప్రశంసలు ఆమెకే దక్కాలి అని అన్నారు.  మోహన్ బాబు మాట్లాడుతూ “శివాజీ గణేశన్ తర్వాత తమిళంలో బెస్ట్ యాక్టర్ శివకుమార్. ఇప్పుడు ఆయన తనయుడు సూర్యతో కలిసి నటించాను. అతను ఎంతో గొప్ప మనిషి. సూర్యని చూసి శివకుమార్ గర్వించాలి. అలాంటి గొప్ప నటుడు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: