బాలీవుడ్ శృంగార తార ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ని సైతం మెప్పించి -విదేశ గాయకుడిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ తార కళ్లముందు కనిపిస్తుంది. ప్రియాంక నిక్‌జోనస్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నిక్‌జోనస్ ప్రియాంక కంటే వయసులో ఏడేళ్ళు పెద్దది. అయినప్పటికీ నిక్ తనను ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరు దాదాపు మూడేళ్ళపాటు ప్రేమించుకుని ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఇరు కుటుంబీకులను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. నిక్ జోనస్ పాప్ గాయకుడు. వీరిద్దరి పెళ్లివేడుక వైభవంగా నిర్వహించడానికి ప్రియాంకచోప్రా సన్నాహాలు చేసింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను పెళ్లి వేదికగా నిర్ణయించి. నవంబర్ మాసంలో అక్కడి చారిత్రక ఉమేద్‌భవన్‌లో వివాహం జరిగింది. వివాహానికి ముందు ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్ జోధ్‌పూర్‌ను సందర్శించి వివాహ ఏర్పాట్ల గురించి చర్చించారు. పెళ్లికి ఇరు కుటుంబానికి సంబంధించిన రెండొందల మంది అతిథులు అక్కడకు వెళ్ళి వారిని ఆశీర్వదించారు. వివాహానంతరం హాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం న్యూయార్క్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది ప్రియాంక. అలాగే బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబయిలో విందు ఏర్పాటు చేసింది.
హాలీవుడ్లో అరంగేట్రం చేసిన అనంతరం ప్రియాంకచోప్రా గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లి తరువాత కూడా తన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు రావని ఇటీవలె మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అసలు ఇప్పటివరకు అలా మారే అవసరం కూడా రాలేదని తెలిపింది. నిక్ తనను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటున్నారని “పెళ్లి తర్వాత చాలా మంది స్త్రీలు ఫెమినిస్ట్లుగా మారిపోతారని చెప్తుంటారు. నా దృష్టిలో ఫెమినిజం అంటే తమ అభిప్రాయాలను గౌరవించమని చెప్పడమే. అంతేకానీ మరొకర్ని విమర్శించడం కాదు. ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించినప్పుడే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది” అని తెలిపింది. తాజాగా ప్రియాంక ది వైట్ టైగర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఢిల్లీలో ప్రారంభమైంది.