క్రేజీ యూత్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆయ‌న న‌టించిన‌ `వరల్డ్  ఫేమస్ లవర్` ప్రేమికుల రోజు కానుకగా ఈ రోజు విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ మునుపెన్నడూ లేని విధంగా నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్- కేథరిన్ థ్రెసా- రాశీ ఖన్నా- ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాని క్రాంతి మాధవ్ తెరకెక్కించారు, మరి ఈ మూవీ మీద దేవరకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌తోనే సినిమా పై యూత్‌లో మంచి హైప్ వ‌చ్చేలా చేశారు. 

ఒక సినిమాలు నలుగురు హీరోయిన్స్ ఏంటి? అని అంద‌రూ అనుకోవాల‌ని అలాగే అసలు విజయ్ ఈ సినిమాలో ఎన్ని పాత్రలు చేశాడు. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయమా లాగా నాలుగు పాత్రలు చేశాడా ? అనే క్యూరియాసిటీ చాలా మందిలో ముందుగానే క‌లిగించాడు. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం నా కెరియర్‌లో చివరి లవ్ స్టోరీ అంటూ ప్రేక్ష‌కుల‌కు మ‌రో షాకింగ్‌  స్టేట్ మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. 

ఇక  ఈ చిత్రం భారీ అంచ‌నాలు అందుకోలేదు. ఫ‌స్ట్ ఆఫ్ ప‌ర్వాలేదు అనిపించుకుంది. క‌థ‌, క‌థ‌నాలు అంతత మాత్రం అలాగే  ఇంతకు మునుపు అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చిన గోపీ సుందర్ ఈ సినిమాతో విజువల్ గా ఓకే అనిపించారు. జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వ‌చ్చింది. పాటల్లో మరింత బాగుంది.  విజ‌య్ న‌ట‌న వ‌ర‌కు ఓకే స్లో క‌థ‌నాలు అవ‌న్నీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. రాశీ, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ల  పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పాలి.  తెలంగాణాకు చెందిన శీనయ్య భార్య పాత్రలో  సువర్ణగా ఐశ్వర్య రాజేష్‌ పరిచయం అయ్యింది. మొత్తానికి ఈ సినిమా అంతా యూత్ తెగ చూసేసేలా ప్ర‌మోష‌న్స్ మాత్రం తెగ పీక్స్‌లో ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ సినిమా చూస్తే మాత్రం ఆశించినంత‌గా లేద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఈ మ‌ధ్య విజ‌య్ సినిమాలు ఎందుకోగాని పెద్ద‌గా హిట్ కావ‌డం లేదు. గ‌తంలో ఆయ‌న ప్రొడ్యూస్ చేసిన సినిమాకి కూడా ప్ర‌మోష‌న్స్ పీక్స్‌లో ఇచ్చారు కానీ ఆ సినిమా కూడా చ‌తికిల‌ప‌డిన బాప‌తే. 

మరింత సమాచారం తెలుసుకోండి: