భారీ అంచనాల మధ్య విజయ్‌ దేవరకొండ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లాస్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ తొలిసారిగా చేసిన ఈ ప్రయోగం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా నాలుగు విభిన్న ప్రేమకథలతో తెరకెక్కిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే చాలా పెద్ద మైనస్‌ అంటున్నారు. నాలుగు కథలను ప్యారలల్‌గా చూపించటంలో దర్శకుడు తడబడ్డాడన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.

 

మామూలుగానే క్రాంతి మాధవ్‌ సినిమాల స్క్రీన్‌ ప్లే చాలా స్లోగా సాగుతుంది. అలాంటి స్క్రీన్‌ ప్లే ఫార్మాట్‌లో నాలుగు విభిన్న ప్రేమకథలను చెప్పటంతో ప్రేక్షకుల కన్‌ఫ్యూజ్‌ అవుతున్నరట. నలుగురు హీరోయిన్లు నాలుగు విభిన్న నేపథ్యాలు ఇలా అన్ని తెర మీద గజి బిజీగా తయ్యారయ్యాంటున్నారు. అయితే నటీనటులు పర్ఫామెన్స్‌లు సూపర్బ్‌ అనిపించేలా ఉండటం కాస్త కలిసోచ్చే అంశంమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి విజయ్‌ తన ఇమేజ్‌తో పాటు నలుగురు ముద్దుగుమ్మలతో కలిసి సినిమాను ఎక్కడి వరకు తీసుకు వస్తాడో చూడాలి.

 

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసా బెల్లాలు నటించారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌ పై కేఎస్‌ రామారావు సమర్పణలో ఏ వల్లభ సినిమాను నిర్మించారు. దర్శకుడు క్రాంతి మాధవ్‌ తన రెగ్యులర్‌ స్టైల్‌ ను పక్కన పెట్టి ఈ సినిమాతో ఓ డిపరెంట్ కమర్షియల్ ప్రయోగం చేశాడు. క్లాస్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రాంతి మాధవ్‌ ఈ సినిమాలో కాస్త హద్దులు దాటాడు కూడా. ఈ సినిమా ఏ సర్టిఫికేట్‌ ఇవ్వటంతో పాటు కట్స్‌ కూడా చాలా సూచించారు సెన్సార్‌ సభ్యులు. ప్రస్తుతానికి ఈ సినిమా బిలో యావరేజ్‌ అన్న టాక్‌ మాత్రమే వచ్చింది. మరి విజయ్‌ ఈ సినిమాను హిట్ రేంజ్‌కు తీసుకెళ్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: