సెన్సేషనల్ స్టార్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియ‌ర్ కామ్రేడ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న చేసిన సినిమా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14 కానుక‌గా భారీ అంచ‌నాల‌తో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

అయితే ఆ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ ఇక తన స్టైల్లో ఇటూ యాక్టింగ్‌లోను అటూ విడుదలకు ముందు నిర్వహించిన ప్రచారం కూడా సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇప్ప‌టికే యూఎస్‌లో ఈ సినిమాపై ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. నలుగురు యువతులతో వేరు వేరు పేర్లతో ఉన్న విజయ్ లవ్ స్టొరీ ఎలా సాగింది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

 

ఇక సినిమా విష‌యంలోకి వ‌స్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి సినిమా చూసే ప్రేక్షకునికి ఈ చిత్రంపై ఆసక్తిని తగ్గించేస్తాయ‌ని అంటున్నారు.  సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినప్పటికీ ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు. మ‌రోవైపు ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. విజయ్‌కు తోడుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని అంటున్నారు. అయితే కథలో మరో కథ అనే కాన్సెప్ట్ జనాలు జీర్ణించుకోవడం కష్టమని అంటున్నారు. మ‌రి ఈ సినిమా ముందు ముందు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది.. విజ‌య్ దెవ‌ర‌కొండ‌కు ఎంత వ‌ర‌కు హిట్ ఇస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: