పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలతో విజయ్ దేవరకొండ లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ రౌడీ హీరో. ఈసారి బాక్సాఫీస్ వద్ద ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌తో బౌండరీ బాదడం ఖాయమే అంటున్నాడు ఈ రౌడీ హీరో. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ని తనదైన శైలిలో నిర్వహించి హైప్ తీసుకువచ్చారు. లవ్ స్టోరీస్ అంటే విజయ్‌కి కొట్టిన పిండే కావడంతో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మ్యాజిక్ చేయడం ఖాయంగానే కనిపిస్తున్నాడు.

 

 

వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్ర టైటిల్‌తోనే సినిమాపై యూత్‌లో మంచి హైప్ తీసుకురాగలిగారు. దీనికి తోడు ఈ చిత్రంలో ఏకంగా నలుగురు హీరోయిన్స్‌‌ని విజయ్‌కి లవర్స్‌గా చూపిస్తూ ప్రేమ కథా చిత్రాల్లోనే ఒక వినూత్న ప్రయత్నానికి తెరతీశారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా రొమాన్స్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు విజయ్. ఒకే సినిమాలు నలుగురు హీరోయిన్స్ ఏంటి? అసలు విజయ్ ఈ చిత్రంలో ఎన్ని పాత్రలు చేయబోతున్నాడు. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చూసే ఉంటాం.. ఈ సినిమాలో కొంపతీసి విజయ్ నాలుగు పాత్రలు చేయబోతున్నాడా? అనే క్యూరియాసిటీ కలిగించాడు.

 

 

ఇది ఒక రకంగా విజయ్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చే స్టేట్ మెంట్ అనే చెప్పాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం నా కెరియర్‌లో చివరి సినిమా అని స్టేట్ మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఏదో మాట వరసకు అన్నట్టుగా కాకుండా.. ఇదే నా చివరి చిత్రం తరువాత ఏలాంటి సినిమాలు చేస్తారో.. ఏప్రిల్ నెలలో శాంపిల్ చూపిస్తా అన్నారు విజయ్ దేవరకొండ. దీంతో లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విజయ్ దేవరకొండ చేస్తున్న చివరి చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కావడంతో ఈ సినిమాలో ఏం చేయబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో రేకెత్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: