సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్‌. విజయ్‌ కూడా అందుకు తగ్గట్టుగా నాలుగు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో అలరించేందుకు రెడీ అయ్యాడు.

 

గతంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌ తన స్టైల్ మార్చి ఈ సినిమాను తెరకెక్కించాడు. విజయ్‌ స్టైల్‌లో ఓ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కించాడు. నాలుగు విభిన్న నేపథ్యాలు విభిన్న ప్రేమకథల్లో విజయ్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసా బెల్లా లు హీరోయిన్లుగా నటించారు.

 

ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్‌ రామారావు సమర్పణలో ఎ వల్లభ నిర్మించాడు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ రాలేదు. విజయ్‌ దేవరకొండకు యాసిడ్‌ టెస్ట్‌ లాంటి సినిమా నిరాశపరచటంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. ముక్యంగా సినిమాలో నటీనటుల పర్ఫెమెన్స్‌ ఆకట్టుకున్నా అసలు కథే ఆకట్టుకోలేదంటున్నారు ఆడియన్స్‌. ఐశ్వర్యా రాజేష్‌, రాశీ ఖన్నా కెరీర్‌ బెస్ట్ పర్ఫామెన్స్‌తో మెప్పించినా కథలో అంత సీన్‌ లేకపోవటంతో ఫలితం తిరగబడిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


సినిమాలో పాత్ర‌ల వ‌ర‌కు బాగానే ఉన్నా కథ ఆ స్థాయిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐశ్వ‌ర్య రాజేష్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి భార్యగా మంచి నటన కనబర్చింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన బెస్ట్ ను అందించింది. అలాగే రాశీ కూడా మంచి పెర్ఫామెన్స్ ను కనబర్చింది. అయితే కథ సరిగా లేకుండా కేవలం నటీనటుల పర్ఫామెన్స్‌ సినిమాను ఎంతవరకు కాపాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: