సింధూర‌పువ్వు ఈ పాట ఈ సినిమా ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. రాంకీ, విజ‌య్‌కాంత్‌, నిరోషా న‌టించిన ఈ చిత్రం సూప‌ర్‌డూప‌ర్ హిట్ అని చెప్పాలి. ఇక రాంకీ ఈ చిత్రంలో న‌టించేకంటే ముందే ఐదు చిత్రాల్లో హీరోగా న‌టించారు. అవి సూప‌ర్‌హిట్ అయ్యాయి. అప్ప‌టికే ఆయ‌న సూప‌ర్ హీరో. సింధూర పువ్వు స‌మ‌యంలో ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ రాంకి  ఫ్రెండ్స్ వాళ్ళే త‌న‌కు నిరోషాని చూపించార‌ట‌. నిరోషా అప్పుడే లండ‌న్‌లో చ‌దువుకుని ఇండియాకి వ‌చ్చింది.  రాంకీ ఆ  ఫొటో చూడ‌గానే ఏంటి సార్ ఈ అమ్మాయి బాలేదు. నాకు వ‌ద్దు అన్నార‌ట‌. అప్పుడు నిరోషా క‌మ‌ల్‌హాస‌న్‌తో ఒక సినిమాలో బుక్ అయింది. నిరోషా రాధిక చెల్లి చాలా బాగా న‌టిస్తుంది. మంచి అభిన‌యం ఎక్స్‌ప్రెష‌న్స్ చూపిస్త‌ది అని ద‌ర్శ‌కులు రాంకికి చెప్పారు.  అయినా స‌రే ఆయ‌న ఏంటి ఈ ఫొటో ప‌నిమ‌నిషిలా ఉంది అన్నార‌ట‌. అంటే బ్లాక్‌గా ఉండ‌డంతో వ‌ద్ద‌ని చెప్పేశాను. ఇక ఈ విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్లు త‌ర్వాత నిరోషాకి చెప్పేశారు దాంతో మొద‌టిరోజు నుంచి షూటింగ్‌లో ఫైట్ రాంకీతో. 

 

అలా ఫైట్ ఫైట్ కాస్త రొమాన్స్‌కి వెళ్ళింద‌ట‌. వారిద్ద‌రి ప్రేమ అలా మొదలైంది. ఆ త‌ర్వాత మేమిద్ద‌రం క‌లిసి న‌టించిన దాదాపు 7 చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ల‌య్యాయి. దాని త‌ర్వాత ప్ర‌తి రోజు ఎక్కువ క‌ల‌వ‌డం యాక్టింగ్ ఇంక నాతోనే ఎక్కువ జ‌ర్నీ ఉండేది. 1987లో వీరిద్ద‌రి ప్రేమ మొద‌లైతే...1998లో వీరి వివాహం జ‌రిగింది. మ్యారేజ్ అయిన త‌ర్వాత త‌ను సినిమాల్లో పెద్ద‌గా న‌టించ‌క‌పోయినా రాంకి మాత్రం ఎప్పుడూ స‌పోర్ట్‌గా ఉండేవార‌ట‌. అందుకు కార‌ణం త‌ను ఆల్రెడీ ఓ మంచి సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన అమ్మాయి కాబ‌ట్టి.  

 

రాంకి అప్ప‌ట్లో మంచి రొమాంటిక్ హీరో అయితే అప్ప‌ట్లో ఆయ‌న‌కు నిరోషా ప్ర‌పోజ‌ల్ మాత్రమే కాకుండా చాలా ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ట‌. వాటివ‌ల్ల కొన్ని ఇబ్బందులు కూడా ప‌డ్డార‌ట‌. కానీ చివ‌రికి నిరోషాను పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యారు రాంకి. సినిమాల విష‌యం వ‌చ్చేస‌రికి యాక్టింగ్‌లో నిరోషాకి దాదాపు 10సార్లు మంగ‌ళ‌సూత్రాలు క‌ట్టాను. నిరోషా తెలుగులో కూడా చాలా సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక్ట‌టుకున్నారు. బాల‌కృష్ణ‌తో నారీనారీ న‌డుమ‌మురారి చిత్రంలో బాల‌కృష్ణ మ‌ర‌దలిగా న‌టించారు. ఆ పాత్ర‌లో నిరోషాకి మంచి పేరు వ‌చ్చింది. అంతేకాక అందులోని ఓ పాట ఇప్ప‌టికీ మంచి హిట్ సాంగ్ అనే చెప్పాలి. ఇరువురి భామ‌ల కౌగిలిలో స్వామి ఇరుకున ప‌డి నీవు న‌లిగితివా...అన్న పాట అప్ప‌ట్లో పెద్ద హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: