మన సినిమాల్లో బీచ్ సాంగ్స్ కి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతి సినిమాలో బీచ్ సాంగ్ ని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. హీరో హీరోయిన్ల మధ్య ఔట్ డోర్ లో రొమాంటిక్ సాంగ్ తీయాలంటే ఖచ్చితంగా బీచ్ నే ప్రిఫర్ చేస్తుంటారు. కొందరు దర్శకులైతే తమ సినిమాల్లో బీచ్ సాంగ్ లేకుండా సినిమానే తీయరు. అలాంతి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు పూరిజగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాల్లో సముద్రానికి ఉన్న ఇంపార్టెన్సే వేరు.

 

 

అయితే బీచ్ సాంగ్స్ కానీ, సముద్రం మీద తీసే షాట్స్ కానీ ఎక్కువగా గోవాలోనే జరుగుతుంటాయి. గోవా మనకి చాలా దగ్గర కావడం.. ఇంకా అక్కడ షూటింగ్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడం మొదలగు వాటి వల్ల గోవాలో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక నుండి అలా ఉండదట. గోవాలో ఇప్పతి వరకు కొన్ని వందల షూటింగ్ లు జరిగి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు.

 

 

కానీ మొదటిసారిగా గోవా ప్రభుత్వం గోవాలో చేసే షూటింగ్స్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అయితే ఇలా పెట్టడానికి చాలా బలమైన కారణం ఉంది. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం "మలంగ్" ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుందట. ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని జంటగా నటించారు. అయితే ఈ సినిమాలో గోవాని డ్రగ్స్, సెక్స్ రాకెట్ కి అడ్డాగా చూపించడం జరిగింది. గోవాని అలా చూపించడంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిరాశకి గురయిందట.

 

 

గోవా అనగానే బీచ్, అమ్మాయిలు, డ్రగ్స్, సెక్స్ రాకెట్ కి సంబంధించిన వాటినే చూపిస్తుండడంతో గోవా ప్రభుత్వం ఇక నుండి అక్కడ జరిగే షూటింగ్ లపై రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇక నుండి ఎవరైనా గోవాలో షూటింగ్ చేయాలనుకుంటే.. గోవాని ఏ విధంగా చూపిస్తున్నారో చెప్పిన తర్వాతే షూటింగ్ కి అనుమతులు ఇస్తారట. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని పరిశీలించిన తర్వాతే గోవాలో షూటింగ్ లకి అనుమతులు ఇస్తారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: