టాలీవుడ్‌లో ఏజ్‌ బార్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ఉన్న హీరోల్లో నితిన్ కూడా ఒకడు. హీరోగా కెరీర్‌ మంచి ఫాంలో ఉన్నా ఈ యంగ్ పెళ్లి మీద ఇన్నాళ్లు దృష్టి పెట్టలేదు. అయితే ఈ ఏడాది ఈ కుర్ర హీరో పెళ్లి పీటలెక్కేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే నితిన్‌ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. శనివారం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నితిన్‌ ఎంగేజ్‌మెంట్ జరగనుందన్నటాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా నితిన్‌ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

 

నితిన్‌ చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. ఎంబీఏ గ్రాడ్యూయేట్‌ అయిన షాలినినీ నితిన్‌ వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవల టాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ తమ వివాహాలను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో చేసుకుంటున్నారు. నితిన్ కూడా తన వివాహానికి అలాంటి ఏర్పాట్లే చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్‌ షాలినీలా వివాహానికి ముహూర్తం, వేదిక కూడా ఫిక్స్‌ అయ్యింది.

 

ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వనించాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి అనేది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం అని భావిస్తున్న సెలబ్రిటీలు.. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యే ఈ వేడుకను జరుపుకోవాలని భావిస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. అయితే తాజాగా నితిన్‌ చేసుకోబోయే అమ్మాయి ఫోటో కూడా బయటకు వచ్చింది. హీరోయిన్‌ లా కనిపిస్తున్న షాలినిని చూసి నితిన్‌ ఫ్యాన్స్‌ తమ హీరోకి తగిన జోడి దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే నితిన్‌ ప్రస్తుతం భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: