టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ గత చిత్రం డియర్‌ కామ్రేడ్‌ నిరాశ పర్చడంతో పాటు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రానికి మొన్నటి వరకు విజయ్‌ పెద్దగా ప్రచారం చేయక పోవడంతో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌కు అస‌లు బిజినెస్ జ‌రుగుతుందా ? అన్న సందేహాలు కూడా చాలా మంది వ్య‌క్తం చేశారు. అయితే విజయ్‌ రంగంలోకి దిగిన వారం రోజులోలనే సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గురించి ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది. 

 

సినిమా రిలీజ్‌కు ముందే ఏకంగా రు. 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ క‌లుపుకుంటే రు.10 కోట్ల వ‌ర‌కు వెళ్లింది. అంటే మొత్తం రు. 40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత కేఎస్‌.రామారావుకు దాదాపుగా 10 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ను తెచ్చి పెట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. రిలీజ్ కు ముందు అంతంత మాత్రం బ‌జ్ ఉన్న ఈ సినిమాకు ఈ రేంజ్‌లో లాభాలు అంటే మామూలు విష‌యం కాదు.

 

రెండు వ‌రుస ప్లాపుల‌తో ఉన్నా విజ‌య్ సినిమాకు ఈ రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఈ లాభం మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. మొత్తానికి విజయ్‌ క్రేజ్‌తో నిర్మాత కేఎస్‌ రామారావు పంట పండుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా నిర్మాత కేఎస్‌.రామారావు ఇటీవ‌ల వ‌రుస ప్లాపుల‌తో చాలా న‌ష్ట‌పోయారు. ఇప్పుడు విజ‌య్ ఇచ్చిన బ‌స్టప్‌తో రామారావుకు భారీ లాభాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: