నటరత్న ఎన్టీఆర్ గారి నట వారసత్వంతో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ గురించి మన తెలుగు వారికి పరిచయం అవసరం లేదు. తన 14వ ఏట తాతమ్మ కల అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, ఆ తరువాత రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం మొదలుకొని మొన్నటి రూలర్ వరకు దాదాపుగా 100కు పైగా సినిమాల్లో హీరోగా నటించి హీరోగా ఎంతో గొప్ప పేరు గడించారు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న బాలయ్య పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. 

 

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన లైఫ్ మరియు వైఫ్ గురించి మాట్లాడిన బాలకృష్ణ, తనకు ఫస్ట్ లవ్ అంటూ ఏమి లేదని, అయితే ఒకానొక సందర్భంలో తెలిసిన వారి పెళ్లి వేడుకకు వెళ్లాగా, అక్కడ తన భార్య వసుంధరను చూశానని, అయితే చూడడానికి చక్కగా ఉన్న ఈ అమ్మాయి ఎవరా అని తనకు అనిపించిందని అన్నారు. అయితే కొద్దిరోజుల తరువాత తనకు ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టి, ఒక పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసారని, అయితే షాకింగ్ గా తాను చూడడానికి వెళ్ళింది వసుంధరనే అని అన్నారు. 

 

ఇక ఆ తరువాత తమ ఇరువురి మధ్య బాగా మాటలు నడిచాయని, ఒకరిని మరొకరం ఎంతో అర్ధం చేసుకుని వివాహం చేసుకుని ఇన్నేళ్ళైనా కూడా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాం అని అన్నారు. అయితే మొదటి నుండి వసుంధర తనకు ఎంతో తోడు నీడ గా ఉండడడంతో పాటు తనకు షూటింగ్ ఉన్న సమయంలో ఏ మాత్రం ఇంట్లోని వారితో, అలానే పిల్లలతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకునేదని అన్నారు. తన కష్ట నష్టాల్లో ఎల్లవేళలా తనతో కలిసి ఉండి, మనసుని అర్ధం చేసుకుని నడుచుకునే వసుంధర అంటే తనకు ఎంతో ప్రాణం అని బాలయ్య అన్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: