మూడు సినిమాలకే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన రెండో సినిమానే సెన్సేషనల్ హిట్ అయ్యింది. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఆ సినిమాలో తన నటనతో అందరిని సర్ ప్రైజ్ చేశాడు విజయ్. అయితే విజయ్ సినిమా అనగానే అందరికి అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలోని పాత్రకు తన పూర్తి నటనను బయటపెట్టిన విజయ్ దేవరకొండ తను ఏం చేసినా అదే పాత్రను పోల్చుకుంటున్నారు. 

 

అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందంలో పూర్తిగా కొత్త పాత్రలో మెప్పించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత నోటా, టాక్సీవాలా సినిమాలతో కూడా కొత్తగా కనిపించాడు. అయితే మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమాలో మాత్రం మళ్లీ అర్జున్ రెడ్డి తాలూఖా గుర్తులు అక్కడక్కడా కనిపించాయి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఫెయిల్యూర్ లవర్ గౌతం పాత్రలో విజయ్ కనిపించాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అర్జున్ రెడ్డిని పోలినట్టు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.

 

అర్జున్ రెడ్డి పాత్రకు, గౌతం పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాని అదే గుబురు గడ్డంతో విజయ్ కనిపించడం వల్ల అలా అనిపిస్తుంది. ఇక తన సినిమాలో లిప్ లాక్స్ లేకపోతే తన ఫ్యాన్స్ బాధపడతారని భావించిన విజయ్ డియర్ కామ్రేడ్ లో కూడా రాశి ఖన్నా, ఇజా బెల్లాతో లిప్ లాక్ సీన్స్ చేశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ బిల్డప్ ఇచ్చినంత ఏమి లేదు కాని విజయ్ ని చూస్తే మాత్రం అర్జున్ రెడ్డి ఫీవర్ నుండి ఇంకా బయటకు రాలేదన్న విషయం మాత్రం అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: