ఈ మధ్య బాలీవుడ్‌ యంగ్ హీరో వరుణ్‌ ధావన్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ నటాషా దలాల్‌ ను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్‌ రిచా చద్దా విషయం లోనూ అలాంటి రూమర్సే వచ్చాయి. ఈ భామ తన బాయ్‌ ఫ్రెండ్‌ ను త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు కొద్ది రోజులుగా వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తల పై రిచా ఘాటుగా స్పందించింది.

 

గత కొంత కాలంగా నటి రిచా చద్దా, నటుడు అలి ఫజల్‌ తో కలిసి కనిపిస్తోంది. సినిమా ఫంక్షన్స్‌ తో పాటు ప్రైవేట్ పార్టీల్లోనూ వీరిద్దరు కలిసి కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ గా మారటంతో రిచా ఆ వార్తలపై స్పందించింది. అయితే రూమర్స్‌ పై నేరుగా స్పందించకుండా తనదైన స్టైల్‌ రివర్స్‌ పంచ్‌ వేసింది రిచా.

 

`ఉదయం 9 గంటలకు మేం పెళ్లి చేసుకుంటున్నాం, సాయంత్రం నాలుగు గంటలకు మా పెళ్లి పోయింది. ఇలా కన్‌ఫ్యూజ్‌ అవ్వటం ఎందుకు. మీరే ఓ టైం డిసైడ్‌ అయి మాకు తెలియజేయండి. అంతే కాదు మా పిల్లలకు కూడా పేర్లు డిసైడ్‌ చేయండి. వాళ్లను ఏ స్కూల్‌ కు పంపించాలో కూడా డిసైడ్‌ చేయండి. స్కూల్‌లో డొనేషన్‌ కట్టాల్సి ఉంటుంది. మీరే కట్టేయండి ప్లీజ్‌` అంటూ ట్వీట్ చేసింది రిచా.

 

గతంలో స్ట్రీట్‌ డ్యాన్సర్‌ హీరో వరుణ్ ధావన్‌ విషయంలోనూ ఇలాంటి వార్తలే వినిపించాయి. వరుణ్ నటాషా దలాల్‌ ఇంటికి వెళ్లిన సందర్భంలో వరుణ్, నటాషాల రోకా కార్యక్రమం అన్న పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన వరుణ్‌ అది కేవలం బర్త డే పార్టీ మాత్రమే రోకా సెర్మనీ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు వరుణ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: