యువరత్న నందమూరి బాలకృష్ణ కు గత ఏడాది ఎంత మాత్రం కలిసి రాలేదు. ఆయన హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు ఘోరమైన డిజాస్టర్ అయ్యాయి. ఇక గతేడాది చివర్లో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన కమర్షియల్ సినిమా రూల‌ర్ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో బాలయ్య రూట్ మార్చాడు. తన కెరీర్ లోనే రెండు తిరుగులేని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

ఇక బాల‌య్య కెరీర్‌లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇచ్చిన బోయ‌పాటి అంటే బాల‌య్య కు కూడా ఎంతో న‌మ్మ‌కం. అందుకే ఇప్పుడు త‌న కెరీర్‌కు ఖ‌చ్చితంగా హిట్ అవ‌స‌రం ఉండ‌డంతో బాల‌య్య బోయ‌పాటినే న‌మ్ముకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యింది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

ఇక ఈ సినిమా ప్లాస్ బ్యాక్ రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నటు ఫ్యాక్షనిస్ట్ తరహాలో బాలయ్య క్యారెక్టర్ ఉంటున్నట్లు ఇప్ప‌టికే సినిమా యూనిట్ ద్వారా మ్యాట‌ర్ బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. ఇక బాల‌య్య గుండు గెట‌ప్ లీక్ అవ్వ‌డంతో బాలయ్య బాబు గెటప్ అంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఏకంగా 15 కిలోల బరువు తగ్గార‌ని టాక్‌..?

 

ఇక అనంత‌పురం జిల్లాలోని పెనుగొండ స‌మీపంలో ఓ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ సినిమా ప్లాస్ బ్యాక్ ఉంటుంద‌ట‌. బాల‌య్య‌కు సీమ క‌థ‌లు బాగా క‌లిసొస్తాయి. గ‌తంలో బాల‌య్య‌ నటించిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహా సూప‌ర్ హిట్ అయ్యాయి. మ‌రి ఈ సినిమా ఏం చేస్తుందో ?  బాల‌య్య కెరీర్ ఎలా ట‌ర్న్ చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: