ఈరోజు విడుదల అయిన  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీకి విజయ్ దేవరకొండ ఊహించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోయినా అనవసరంగా అతడి నోటి తీట ఏకంగా మహిళా సంఘాలకు అసహనాన్ని కలిగిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అత‌ను చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అత‌ను హ‌ద్దులు దాటి మాట్లాడాడ‌ని మ‌హిళ‌ల్ని వైద్యుల్ని కించ‌ప‌రిచాడ‌ని అత‌డిపై అనేకమంది దుమ్మెత్తి పోస్తున్నారు. 


ఆసక్తి కలిగించే ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా విజ‌య్ ఈ చిత్ర హీరోయిన్లు రాశి ఖ‌న్నా ఇజ‌బెల్లాల‌ తో క‌లిసి ఒక టీవీ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఒక డాక్ట‌ర్‌తో డేటింగ్ చేయాలని ఉందంటూ రాశి ఖన్నా అన్న మాటల పై విభిన్నంగా స్పందించాడు.  


డాక్ట‌ర్ల‌తో డేటింగ్ అంటే వేరేలా ఉంటుంద‌ని వాళ్లు బాడీలోని పార్ట్స్‌ను సైంటిఫిక్ పేర్ల‌తో పిలుస్తార‌ని బుగ్గ‌ల్ని బుగ్గ‌లు అనరని చెస్ట్‌ ను చెస్ట్ అని కాకుండా అప్ప‌ర్ థోరాక్స్అంటారని ఇలా రకరకాల తనకు తెలిసి తెలియని వైద్య పరి భాషలో కామెంట్స్ చేసాడు. అయితే ఈ విషయాన్ని రాశి ఖన్నా స‌ర‌దాగానే తీసుకుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుభ‌వంతో ఇలా మాట్లాడుతున్నావా అంటూ జోక్ కూడ చేసింది. 


అయితే విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చాలామందికి తెలియడంతో 
అతడి మీద నెటిజ‌న్లు కొంద‌రు విరుచుకుప‌డిపోతున్నారు. మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడాడ‌ని వైద్యుల్ని కించ‌ప‌రిచాడ‌ని విమ‌ర్శించారు. మరికొందరు మహిళా సంఘాల నాయకులు అయితే విజయ్ కు ఏమాత్రం ఇగో తగ్గలేదని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం అతడి మాట‌ల్లో త‌ప్పేమీ లేద‌ని.. అత‌నెవ‌రినీ కించ‌ప‌ర‌చ‌లేద‌ని దీనిని అనవసరపు ఇష్యూ చేయవద్ద‌ని కోరుతూ కామెంట్స్ చేస్తూ విజయ్ దేవరకొండకు సంఘీభావాన్ని తెలియ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: