నాగార్జున తరువాత అక్కినేని కుటుంబం నుండి నలుగురు హీరోలు వచ్చారు అయితే వీరిలో ఒక్కరు  కూడా ఇంత వరకు స్టార్ హీరో రేంజ్ కు వెళ్ళలేదు కాకపోతే ఒకరు మాత్రం స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అర్హతలు సంపాదించుకుంటూ ఆజాబితాలో చేరేందుకు రెడీ గా వున్నారు అతనెవరో కాదు యువ సామ్రాట్ నాగ చైతన్య. సినిమా సినిమా కు నటనలో ఆరితేరుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఈహీరో. వరుస పరాజయాలతో సతమతమైన దశలో గత ఏడాది మజిలీ, చైతన్య కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈసినిమా లో తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు కమర్షియల్ గా కూడా సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. మజిలీ తరువాత చైతన్య గత ఏడాది చివర్లో వెంకీమామ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమాలో  కూడా అతను పరిణితి తో కూడిన నటన కనబర్చాడు  అయితే వెంకీ ఉండడం తో చైతన్య పెద్దగా ఎలివేట్ కాలేదు. అలా రెండు సూపర్ హిట్లు కొట్టిన చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల తో చేతులు కలిపాడు. 
 
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం లవ్ స్టోరీ. కమ్ముల సినిమా అంటే యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. రియాల్టీకి దగ్గరగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి ఆయన సినిమాలు. అలాంటి డైరెక్టర్ చైతన్య తో సినిమా చేయనున్నాడనేసరికి ప్రారంభంకాక ముందే సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. వీరికి సాయి పల్లవి కూడా తోడైంది ఇంకేం  ఒక్కసారి గా ఈకాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈరోజు ఈచిత్రం నుండి 67 సెకండ్ల నిడివి గల ఏయ్ పిల్లా సాంగ్  మ్యూజికల్ ప్రివ్యూ ను విడుదలచేశారు. సాంగ్ అంత గొప్పగా లేకపోయినా చైతన్య-సాయి పల్లవి ల కెమిస్ట్రీ కట్టిపడేసింది. ముఖ్యంగా చివర్లో సాయి పల్లవి ముద్దు పెట్టాక చైతన్య రియాక్షన్స్ హైలైట్ అయ్యాయి. దాంతో ఈ ప్రివ్యూ యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈఒక్క  మ్యూజికల్ వీడియో తో సినిమా బ్లాక్ బాస్టర్ అని తేల్చేశారు. మరి ఈ సినిమా తో  చైతు కెరీర్ లో తొలి సారి 50కోట్ల షేర్ ను మార్క్ ను దాటి స్టార్ హీరో రేంజ్ కు చేరతాడో చూడాలి. లవ్ స్టోరీ ఈ సమ్మర్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: