హీరోయిన్ హన్సిక... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో  తెలుగు తెరకు  హీరోయిన్ గా పరిచయం అయినది హన్సిక. తనదైనా  అందంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించినది. అల్లు అర్జున్ తో నటించిన మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో హన్సిక కెరీర్ కు మంచి బాటలు పడ్డాయి అని చెప్పాలి. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించండి. కేవలం స్టార్ హీరోల సరసన కాదు.. యువ హీరోల సరసన కూడా నటించి తన నటనతో మెప్పించినది. కానీ గత కొంత కాలం నుంచి ఎక్కడ తెరమీద కనిపించడం లేదు. 

 


 సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న హన్సిక సందీప్ కిషన్ తో తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమాలో  నటించింది. అయినప్పటికీ హన్సికకు  మాత్రం అంతగా అదృష్టం కలిసి రాలేదు. ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమాలో హన్సిక  తన గ్లామర్ మొత్తం కోల్పోయినట్టు కనిపించింది . హన్సిక ఈ సినిమాలో నాజుక్క అప్పటికీ ముఖంలో క్యూట్ నెస్ మొత్తం పోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన  హన్సికకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో తమిళం వైపు అడుగులు వేసింది ఈ అమ్మడు. కాగా తమిళంలో కూడా హన్సిక సినిమాలు సరైన విజయం సాధించకపోవడంతో అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. 

 


 ఇదిలా ఉంటే ప్రస్తుతం హన్సికకు  సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా హన్సిక ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫోటోగ్రాఫర్ల కంట పడడంతో... హన్సిక ఫోటోలు క్లిక్ మనిపించారు. వారు తీసిన  హన్సిక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. ఇక ఈ ఫోటోలలో  ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం ఎంతో సన్నగా  కనిపిస్తుంది హన్సిక. ఫేస్ లో మాత్రం మునుపటి ల కనిపించడం లేదు. వయసు అయిపోయినట్లుగా  కనిపిస్తుంది. కాగా ఈ ఫోటో చూసి అభిమానులు కూడా అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో  వయస్సు పైబడినట్టుగా  క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే హన్సిక కెరియర్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం హన్సిక చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. ఇప్పుడు వరకు హన్సిక  50 సినిమాలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: