తమిళంలో తన వర్సటైల్ యాక్టింగ్ తో వరుస ఛాన్సులు అందుకుంటున్న హీరో విజయ్ సేతుపతి. టివి హోస్ట్ గా మొదలైన అతని కెరియర్ కోలీవుడ్ లో హీరో కమ్ విలన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎలాంటి పాత్రలో అయినా చేస్తూ అలరిస్తున్నాడు. తమిళంలో సూపర్ ఫాంలో ఉన్న అతనికి తెలుగులో కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో స్పెషల్ రోల్ లో అలరించిన విజయ్ సేతుపతి మెగా ప్రిన్స్ ఉప్పెన సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతనికి పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది.  

     

ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో అతనే విలన్ గా అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా కోసం అతను భారీగా డిమాండ్ చేస్తున్నాడట. ఇచ్చిన కొద్దిరోజుల డేట్స్ కు కోటిన్నర దాకా చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ సేతుపతి మంచి నటుడే అతన్ని తెలుగు సినిమాల్లో తీసుకుందామని అనుకుంటుంటే అతనేమో భారీగా డిమాండ్ చేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటున్న విజయ్ సేతుపతి అక్కడ సినిమాలు కాదని ఇక్కడ చేయాలంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందే అంటున్నారు కొందరు సిని నిర్మాతలు.

 

కోలీవుడ్ లో అతను ఓ పక్క హీరోగా ఫాం లో ఉండగా విలన్ గా కూడా విజయ్, రజినికాంత్ సినిమాల్లో నటిస్తున్నాడు. తన సహజ నటనతో క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఉప్పెనలో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తున్న విజయ్ ఆ సినిమాతో తన అసలు టాలెంట్ ఏంటో తెలుగు ఆడియెన్స్ కు రుచి చూపించాలని చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: