జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు గాని సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మాత్రం వారి మధ్య ఏదో జరుగుతుంది అని కొందరు, ఎం జరగడం లేదు, వాళ్ళు కావాలనే దూరంగా ఉన్నారు అని మరికొందరు ఏదోక విధంగా అంటూనే ఉన్నారు.

 

సోషల్ మీడియా ప్రచారానికి తగ్గట్టు ప్రధాన మీడియా కూడా అదే విధంగా ప్రచారం చేస్తూ సందడి చేస్తుంది. వీళ్ళు కలిసి సినిమా చేస్తున్నారని కొందరు అంటే, కాదు సినిమా ఆగిపోయిందని మరికొందరు అంటూ వస్తున్నారు. సినిమా ఆగిపోలేదు, జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టం లేక ఆపేసాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా తాజాగా జరుగుతున్న ప్రచారం చూద్దాం.

 

బాలకృష్ణ తన కొడుకు కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. అది ఏంటి అంటే, తన కొడుకుని పరిచయం చేయడానికి గానూ, జూనియర్ ఎన్టీఆర్ సహాయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. 

 

సినిమా ద్వారా తన కొడుకుని పరిచయం చెయ్యాలని చూస్తున్నాడు. జూనియర్ కి తమ్ముడిగా ఒక చిన్నపాటి మల్టీ స్టారర్ ని బాలయ్య తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం త్రివిక్రమ్ ని కూడా బాలకృష్ణ సంప్రదించారని అంటున్నారు.

 

 

జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ సంప్రదించారట. దానికి జూనియర్ నుంచి ఏ సమాధానం రాలేదని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వస్తే బాలకృష్ణ, కథలో మార్పులను సూచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా త్వరలో దీనికి సంబంధించి ఏదోక వార్త వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: