టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం కూడా మంచి ప్రేమకథా సినిమాలు వచ్చేవి. అయితే అప్పటి సీనియర్ నటుల్లో ఒక హీరో ఎక్కువగా అప్పటి యువతలో మంచి క్రేజ్ సంపాదించారు. ఆయన మరెవరో కాదు ఏఎన్నార్. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తొలితరం సూపర్ స్టార్స్ గా తిరుగులేని ఇమేజ్ ని సొతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక్క ఎన్టీఆర్ కి కూడా అప్పటి యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఏఎన్నార్ కు ఉన్న క్రేజ్ వేరట. 

 

ఎందుకంటే, అప్పట్లో ఆయన తొలినాళ్లలో నటించిన దేవదాసు మొదలుకొని, ఆ తరువాత ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, ప్రేమనగర్, అనార్కలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువగా ప్రేమకథా సినిమాలు చేస్తూ ఉండేవారు. 
ఇక ఆ సినిమాల్లో ప్రేమికుడిగా ఏఎన్నార్ తన ఆకట్టుకునే నటనతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించడంతో పాటు లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించారు. ముందుగా ఆయన నటించిన దేవదాసు సినిమా అప్పట్లో అతి పెద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఏఎన్నార్ సరసన సావిత్రి నటించిన ఈ సినిమాలో ఆయన ఒక భగ్న ప్రేమికుడిగా తన సహజత్వ నటనతో ప్రేక్షక లోకం యొక్క నీరాజనాలు అందుకున్నారు. 

 

ఇక ఆ తరువాత అంజలీదేవితో కలిసి ఆయన నటించిన అనార్కలి, సువర్ణసుందరి వంటి లవ్ స్టోరీస్ కూడా అద్భుత విజయాన్ని అందుకోవడం జరిగింది. ఆపై కలర్ సినిమాల రాక మొదలైన తరువాత ఏఎన్నార్ నటించిన ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ప్రేమమందిరం సినిమాలు అతి పెద్ద విజయాలు అందుకున్నాయి. ఇక వాటిలో కూడా భగ్న ప్రేమికుడిగా ఏఎన్నార్ నటన అజరామరం అనే చెప్పాలి. ఆ విధంగా అప్పటి యూత్ లో తన లవ్ బేస్డ్ మూవీస్ తో ఏఎన్నార్ గొప్ప పేరు దక్కించుకుని ముందుకు దూసుకెళ్లారు. మరి ఇప్పటికీ కూడా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే అందరికంటే ముందుగా ఏఎన్నార్ పేరు మనకు గుర్తుకువస్తుంది అంటే, ఆయన నటించిన లవ్ స్టోరీస్ ఎంత గొప్పగా అలరించాయో అర్ధం చేసుకోవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: