గత రెండు సినిమాలతో నిరాస ఎదుర్కొన్న‌ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా వరల్డ్ ఫేమస్ ల‌వ‌ర్. నోటా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఈ సినిమాపై అటు విజయ్ తో పాటు ఇటు విజ‌య్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వరల్డ్ ఫేమస్ ల‌వ‌ర్ మరో అర్జున్ రెడ్డి... గీతగోవిందం... మరో పెళ్లి చూపులు త‌ర‌హాలో సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు.

 

పైగా విజయ్ తొలిసారిగా నలుగురు హీరోయిన్లతో జోడి కట్టడంతో ఈ సినిమా ఏదో సంచలనం నమోదు చేస్తుందని బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది అని అనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు కానుకగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క బోర్లా పడినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విజ‌య్ అభిమానుల‌ది కూడా ఇదే మాట‌. విజయ్‌ సినిమాలో ఒకటి, రెండు హిట్‌ సాంగ్స్‌ అయినా వుంటాయి. ఈ చిత్రానికి ఆ ఉపశమనం కూడా లేదు. ఒక్క హిట్‌ నంబర్‌ కూడా లేకపోవడంతో బోర్‌ మల్టిప్లయ్‌ అయినట్టుంటుంది.

 

ఇక గ‌త కొన్ని సినిమాలతో స‌రైన హిట్ లేకుండా ఉన్న సీనియ‌ర్ నిర్మాత కేఎస్‌.రామారావు ఈ సినిమా కోసం ధారాళంగా ఖర్చు పెట్టారు. ఛాయాగ్రాహకుడు కనువిందైన లొకేషన్లని బంధించాడు. అన్ని హంగు వున్నా కానీ ఇందులో గౌతమ్‌ చెప్పినట్టుగా కథలో మెయిన్ సోల్ మిస్ అయ్యింది. దర్శకుడు క్రాంతిమాధవ్‌ తన తరహాలో ఎమోషనల్‌ సినిమా తీయాలా, లేక విజయ్‌ని అర్జున్‌రెడ్డిలా చూపించాలా అన్న డైల‌మాలో చేతులు ఎత్తేశారు. చివ‌ర‌కు విజ‌య్ ఫ్యాన్స్ సినిమాలో పాట‌ల‌ను అయినా ఎంజాయ్ చేద్దామంటే ఆ ఆశ కూడా ఈ సినిమాలో లేకుండా పోయింది. విజ‌య్ నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్ అనుకోవాల్సిందే..?

మరింత సమాచారం తెలుసుకోండి: