మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసాన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటుగా ఎప్పుడు అభిమానులతో ఏదోక విషయాన్ని ఆమె పంచుకుంటూనే ఉంటుంది.

 

ఎప్పటికప్పుడు వారికి టచ్ లో ఉంటూ తన విషయాలను చెప్తూ ఉంటుంది. తాజాగా ఇలాగే ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆరోగ్య సూత్రాలను కూడా చెప్పే ఉపాసనా తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమ లేఖ తన భర్తకు మినహా అందరికి రాసింది ఈ భామ. 

 

ప్రేమ గురించి చాలా చక్కగా తన పోస్ట్ లో ఈ కొణిదెల వారి కోడలు వివరించారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపాసనా లేఖ రాసింది. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు మరింత ధృఢంగా ఉండేలా ప్రేమికుల రోజు జరుపుకోవాలని సూచించింది.

 

నిన్ను నువ్వు ప్రేమించడమే అసలైన వాలెంటైన్స్ డే అని ఉపాసనా చెప్పిన సూత్రం ఇప్పుడు ఆకట్టుకుంది. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ఒక ప్రశ్న కూడా వేసింది ఈ మెగా కోడలు. 

 

ముందు నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు, అప్పుడే ఇతరులను కూడా ఎలాంటి లాభం లేకుండా ప్రేమించే తత్వం నీకు అలవాటు అవుతుంది. నీకు నువ్వు ప్రేమలేఖ రాసుకో, నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయ్ అని తన అభిమానులకు ఉపాసన ఒక సలహా ఇచ్చింది.

 

ప్రస్తుతం ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంది. మీరు చాలా మంచి వ్యక్తి అని, మనసున్న మనిషి అంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు అంటే, ఇదే సమయంలో పెళ్లి చేసుకున్న భర్తను కూడా ప్రేమించాలి అంటూ కాస్త వ్యగ్యంగా కామెంట్లు చేసారు.

https://twitter.com/upasanakonidela/status/1228179376862187525?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1228179376862187525&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fram-charan-wife-upasana-konidela-special-love-tweet-on-the-occasion-of-valentines-day-pk-453180.html

మరింత సమాచారం తెలుసుకోండి: