టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన హీరోల్లో చాలామంది హీరోలు మంచి ప్రేమకథా సినిమాల్లో నటించి పేరు దక్కిచుకున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి, సూపర్ స్టార్ గా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు గడించిన హీరో ఒకరు మాత్రం ఇప్పటివరకు సరైన లవ్ స్టోరీ మూవీ లో యాక్ట్ చేయలేదు. అయితే ఆయన మరెవరో కాదు, తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ వారసుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు. 

 

రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, కెరీర్ పరంగా ఇప్పటివరకు 26 సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి, మహేష్ బాబుకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అయితే మొదటి నుండి ఇప్పటివరకు మహేష్ నటించిన దాదాపుగా చాలా సినిమాలు యాక్షన్ ఓరియెంటెడ్ వే అని చెప్పవచ్చు. ఇక ఆయన కెరీర్ పరంగా ఇప్పటివరకు సరైన లవ్ స్టోరీ మూవీ ఒక్కటికూడా చేయకపోవడం ఇప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న అంశం. మధ్యలో శోభన్ దర్శకత్వంలో బాబీ అనే లవ్ బేస్డ్ మూవిలో మహేష్ నటించినప్పటికీ, ఆ సినిమా అప్పట్లో ఘోర పరాజయాన్ని అందుకుంది. 

 

ఇక ఆ తరువాత లవ్ స్టోరీస్ జోలికి వెళ్ళని సూపర్ స్టార్, ఎక్కువగా మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలపైనే దృష్టి పెట్టసాగారు. ప్రస్తుతం మహేష్ వయసు 44 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో యంగ్ గా కనపడే సూపర్ స్టార్, నిజానికి ఇప్పుడు మంచి లవ్ స్టోరీ మూవీ చేసినా, ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షులు సైతం ఎగపడి చూస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరి మహేష్, తన ఫ్యాన్స్ కోరికని ఇకనైనా మన్నించి లవ్ స్టోరీ సినిమాలో నటిస్తారో లేదో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: