యంగ్ హీరో నితిన్ హిట్ అందుకున్న ఆఖరి సినిమా మాటల మాంత్రీకుడు తెరకెక్కించిన 'అ..ఆ'. ఆ సినిమా తర్వాత నితిన్ కి మళ్ళీ ఇప్పటివరకు హిట్ దక్కలేదు. లై, ఛల్ మోహన రంగా సినిమా దారుణమైన పరాజాలయని మూటగట్టుకున్నాయి. దాంతో ఈ హీరో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. బాగా రిలాక్స్ అయి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఆ సినిమానే భీష్మ. నితిన్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఛలో ఫేం వెంకీ కుడుకుముల ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే పక్కా రొమాంటిక్ సినిమా అని అర్థమవుతోంది. ఇక తాజాగా ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమపాటను విడుదల చేశాడు నితిన్. 

 

చాలామంది ఎదరుచూస్తున్న భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ ఫ్రెష్ గా రిలీజ్ చేశారు. ఆడియో ఇప్పటికే విడుదలకాగా.. ఇప్పుడు వీడియోతో కూడా ఈ పాట ఆకట్టుకుంది. రకరకాల గెటప్స్ లో నితిన్ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ప్రేమ కోసం పరితపించే అతడి పాత్రను ఈ పాటలో ఎలివేట్ చేయడం బావుంది. వయసొచ్చింది కానీ ఇంకా సింగిల్ గానే ఉన్నానని, తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ నితిన్ పాడేసుకున్నాడు. ఈ క్రమంలో నితిన్ గెటప్స్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

 

సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి లుక్, శోభన్ బాబు లుక్ తో పాటు ఖుషి సినిమాలో పాపులర్ అయిన టెంపుల్ సీన్ ను కూడా ఈ సాంగ్ లో ఫన్నీగా చూపించారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో నితిన్ గెటప్స్, స్టెప్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. అయితే ప్రేమికుల రోజున నితిన్-రష్మిక సాంగ్ ను రిలీజ్ చేస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. సింగిల్స్ ఏంథెమ్ వస్తోందని ముందే తెలిసినా అందులో రష్మిక రొమాన్స్ ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడే నితిన్ టీం ప్రేక్షకులకి చిన్న షాఇచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: