టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఏ కాంత్రి మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు వంటి బ్యూటి ఫుల్ లవ్ స్టోరీతో సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రాంతి మాధవ్ సినిమా అనగానే అందరికి ఆసక్తి మొదలైంది. అందుకో హీరో విజయ్ దేవరకొండ అనగానే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే డియర్ కామ్రేడ్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు విజయ్ నుంచి ఈసారి మంచి హిట్ ని ఆశించారు.

 

కానీ అలా విజయ్ నుంచి ఆశించకూడదని వరల్డ్ ఫేమస్ లవర్ తేల్చేసింది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ చేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు విజయ్ సినిమాలని ఎంతగా ఎంజాయ్ చేస్తారో అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రతీసారి అలాంటి సినిమాలతోనే అదే మ్యానరిజం తో వస్తాను అంటే ఫ్యాన్స్ ఏమైనా పిచ్చోళ్ళా, ప్రేక్షకులని అంత ఖాళీ టైం ఉందా. అదే ఇప్పుడు విజయ్ కి షాకిచ్చింది. 

 

మంచి హిట్ కోసం విజయ్ ఎలా తపిస్తున్నాడో ఆయన ఫ్యాన్స్ కూడా అలానే విజయ్ నుండి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఎదురుచూశారు. అందుకే నాలుగు రోజుల ముందునుంచే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని రెడీగా ఉన్నారు. అయితే అంత ఉత్సాహంతో ఉన్న ఫ్యాన్స్ కి విజయ్ షాకిచ్చాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కళ్ళు ఇదేం సినిమా రా బాబు అంటూ తలబాదుకుంటూ బయటకు వస్తున్నారట.

 

అంతేకాదు ఫ్యాన్స్ కే విజయ్ మీద కోపం వస్తుందట. అందుకు కారణం తమ ఫేవరేట్ హీరో మళ్ళీ నిరాశ పరచడమే కాకుండా మరో ఫ్లాప్ ని తన ఖాలో వేసుకున్నాడని ఫీలవుతున్నారట. ఇక మరీ అభిమానం ఎక్కువైన వాళ్ళైతే వరల్డ్ ఫేమస్ లవర్ కాదు వరస్ట్ లవర్ .. బుద్ధి లేక ఎగేసుకుంటూ సినిమాకెళ్ళాం .. చీ చీ అనుకుంటూ చీదరించుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: