టాలీవుడ్ సినిమా పరిశ్రమకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆ తర్వాత మళ్ళి ఎన్టీఆర్ తోనే సింహాద్రి, యమదొంగ, నితిన్ తో సై, నానితో ఈగ, సునీల్ తో మర్యాద రామన్న, ఆపై ప్రభాస్ తో చత్రపతి, రవితేజ తో విక్రమార్కుడు, నుండి మొన్నటి బాహుబలి, బాహుబలి 2 వరకు వరుసగా ఒక సినిమాను మించి మరొక సినిమాలతో అద్భుత విజయాలు అందుకున్న దర్శక ధీరుడు రాజమౌళి, అలానే ఆయన వైఫ్ రమా రాజమౌళిల వివాహం గురించి మనలో చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. 

 

రాజమౌళికి కార్తికేయ అనే కుమారుడు, మయూఖ అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. రమా రాజమౌళి స్వయానా కీరవాణి భార్య శ్రీవల్లికి సోదరి. 2000 సంవత్సరంలో తన మొదటి భర్త నుండి విడిపోయిన రమ, తన కుమారుడు కార్తికేయతో సహా విడిగా జీవిస్తున్న సమయంలో, ఆమె పద్ధతులు, అలానే వ్యవహార శైలి ఎంతో నచ్చిన రాజమౌళి, పలు విధాలుగా ఆమెకు సహాయం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఏర్పడటం, అనంతరం ఒకరిపై ఒకరికి ఆపై ప్రేమ ఏర్పడటంతో, ఇరు కుటుంబాల పెద్దల సమ్మతంతో వారిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కుమార్తె మయూఖను రాజమౌళి దంపతులు దత్తత తీసుకున్నారు. 

 

ఇక ఒకానొక సమయంలో రాజమౌళి తీస్తున్న సినిమాలోని ఒక సీన్ లో కాస్ట్యూమ్ డిజైనర్ అందించిన దుస్తులతో రాజమౌళి సంతృప్తికరంగా లేకపోవడాన్ని గమనించిన రమ, ఆయన ఆలోచనలకు తగ్గ దుస్తులను ఎంపిక చేసి సీన్ లోని పాత్రధారికి అందించారు. దానితో ఎంతో సంతృప్తి చెందిన రాజమౌళి, అక్కడి నుండి వరుసగా తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ రమనే తీసుకోవడం మొదలు పెట్టారు. ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచించే రాజమౌళి, సాయంత్రం ఇంటికి వస్తే చాలు ఒక్కసారిగా పిల్లాడిలా మారిపోయి కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారని, మంచి మనసున్న ఆయన వంటి వ్యక్తి తన భర్తగా దొరకడం తన అదృష్టం అని రమ పలు ఇంటర్వ్యూ ల్లో చెప్తూ ఉంటారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: