ఏ ముహూర్తాన క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నాగార్జున టబు ల తో నిన్నే పెళ్ళాడతా సినిమా తీశాడో గాని టబు జీవితంలో పెళ్ళి అన్న పదమే లేకుండా పోయింది. ఆ సినిమాతోనే టబు నాగార్జున పక్కన హీరోయిన్ గా ఫేమస్ అవడమే కాదు జనాల దృష్ఠిలో లవర్ అన్న ముద్ర పడిపోయింది. దానికి తోడు టబు ప్రతీ చిన్న విషయాన్ని నాగార్జున తో కూలంకుశంగా చర్చిస్తుంది. ఇది చూసిన వాళ్ళకి కన్ను కుట్టి వార్త రాసేయడమో లేదా మోసేయడమో చేశారు. ఆ మధ్య చాలాసార్లు నాగ్ ఈ విషయంలో స్పందించిన సందర్భాలున్నాయి. ఎవరు ఎన్ని సార్లు అడిగినా నాగార్జున నాకు టబు కి మధ్యన ఏం లేదనే చెబుతూ వచ్చారు. ఇప్పటికీ చెబుతున్నారు. 

 

ఇక నాగార్జున సరసన టబు నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, సిసీంద్రి లో స్పెషల్ సాంగ్ చేసింది. అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇది సినిమా రిలేషన్. అయితే పర్సనల్ లైఫ్ లో కూడా టబు కి నాగార్జున మాత్రమే క్లోజ్ ఫ్రెండ్ అట. పక్కా హైదరాబాది అయిన టబు ముందుగా విక్టరీ వెంకటేష్ సరసన కూలీ నంబర్ వన్ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత సిసీంద్రి లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమానే నిన్నే పెళ్ళాడతా. ఈ సినిమాతో బెస్ట్ హీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని సొంతం చేసుకుంది.

 

ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే సినిమా చేసింది. అంతే మళ్ళీ తెలుగులో కనిపించలేదు. చాలా కాలానికి నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి, ఆ తర్వాత మెగాస్టార్ తో అందరివాడు సినిమాలో నటించింది. టబు తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువైనప్పటికి ఆ సినిమాలన్ని తనకి హిట్స్ తో పాటు మంచి పేరుని తీసుకు వచ్చాయి. ఇక రీసెంట్‌గా మాటలో మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో టబు చేసిన పాత్రకు మంచి పేరు తెచ్చింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాగార్జున, టబు వయసు పెరిగినప్పటికి గాసిప్ రాయుళ్ళుమాత్రం ఇంకా వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏదో ఉందనే మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే టబు రీ ఎంట్రీ ఇచ్చింది నాగార్జున కోసమే అని అమల ఫీలవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదో గాని వీళ్ళు మాత్రం తెగ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: