టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, కెరీర్ పరంగా 350కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ నటించిన పద్దెనిమిది సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయ్యాయి అంటే, కెరీర్ పరంగా సినిమాలతో ఆయన ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఇక అందంలోనూ, అభినయంలోనూ ఎంతో గొప్ప పేరున్న కృష్ణ, వ్యక్తిగతంగా మంచితనంలో కూడా అంతే గొప్ప పేరు సంపాదించారు. ఇక తనవద్దకు సినిమాలు చేయడానికి వచ్చే దర్శక నిర్మాతలకు నష్టాలువాటిల్లినట్లయితే, ఆ నష్టాలను తనవిగా భావించి, ఆపై వారికి ఉచితంగా సినిమాలు చేసి పెట్టడం, అలానే తన వంతుగా ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలవటం వంటివి చేసేవారట కృష్ణ. 

 

ఇక కొద్ది రోజుల క్రితం కృష్ణ, విజయనిర్మల కలిసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. విజయనిర్మల జీవించి ఉన్న సమయంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆమె బయటపెట్టారు. ఇక ముందుగా యాంకర్ మాట్లాడుతూ, కృష్ణ గారి మంచితనం గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు, నిర్మాతలని, దర్శకుల్ని ఆయన తన సొంత మనుషులుగా చూసుకునే వారట, దాని గురించి మీకు తెలిసినవి చెప్తారా అంటూ విజయనిర్మల ప్రశ్నించగా, ఆమె మాట్లాడుతూ కొందరు నిర్మాతలు, దర్శకులు కృష్ణ గారి తో సినిమాలు చేసి ఆయనకు  రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని, అలానే మరికొందరైతే మేము చెక్కులు ఇస్తాము వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి అని చెప్పేవారిని అన్నారు. 

 

అయితే ఆ చెక్కులు తీసుకున్న తర్వాత మేము బ్యాంకు లో వేయడం, ఖాతాలో డబ్బులేక అవి రిటర్న్ రావడం జరిగేవని విజయనిర్మల అన్నారు. బహుశా వారి దగ్గర డబ్బులు లేదేమో, వారిని ఎందుకు ఇబ్బంది పెట్టటం, ఆ చెక్కులు వదిలేయ్ అంటూ కృష్ణ అనేవారని, ఆ విధంగా పలువురు నిర్మాతలు ఇచ్చిన చెక్కులు తమ ఇంట్లో కోకొల్లలుగా పడి ఉన్నాయని విజయనిర్మల సరదాగా చెప్పుకొచ్చారు. అభిమానుల ప్రేమ, అనురాగాలు, దర్శక నిర్మాతల శ్రేయస్సే తనకు కొండంత ఆస్తి అని కృష్ణ ఎప్పుడు చెప్తూ ఉంటారు అని విజయనిర్మల చెప్పుకొచ్చారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: