నటుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె అయిన శృతిహాసన్, ముందుగా కోలీవుడ్ లో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక, సిద్ధార్థ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ అనగనగా ఒక ధీరుడు లో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా రంగానికి ఆరంగేట్రం చేసింది శృతి. అయితే ఫస్ట్ మూవీ నే ఘోరంగా ఫ్లాపయి శృతి కి ఎంతో నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన ఓ మై ఫ్రెండ్ కూడా ఫ్లాప్ అయింది. అయితే ఆ పై ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ అనే సినిమాలో ఆమెకు అవకాశం రావడం, ఇక రిలీజ్ అనంతరం ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకొని, కెరీర్ పరంగా శృతి కి మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది. ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో శృతికి వరుసగా అవకాశాలు పెరిగాయి. 

 

అనంతరం 2015 లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆమె హీరోయిన్ గా నటించిన శ్రీమంతుడు సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత నుండి తెలుగులో శృతికి అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి, ఆపై ఆమె తెలుగులో ప్రేమమ్, కాటమరాయుడు సినిమాల్లో నటించగా అవి రెండు ఫ్లాప్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న శృతి, ఆ సినిమాపై ఎన్నో అవకాశాలు పెట్టుకుంది. 

 

గతంలో రవితేజతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించింది శృతి. ఇక ప్రస్తుతం రవితేజ, గోపీచంద్ ల కలయికలోనే క్రాక్ సినిమా తెరకెక్కుతుండడంతో, ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయం అందుకొని తన కెరీర్ పరంగా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్న శృతి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయా తెలియాలంటే, ఈ సినిమా రిలీజ్ సమయమైన మే నెల వరకు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: