పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరుస సూపర్ హిట్లు కొడుతున్న సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి. తనకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఇప్పుడు స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి సినిమా నుండి ఆడియెన్స్ పల్స్ పట్టేసిన అనీల్ రావిపుడి సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. అయితే అలాంటి అనీల్ రావిపుడి అక్కినేని నాగ చైతన్య సినిమా విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. అదేంటి చైతు సినిమాకు అనీల్ రావిపుడికి సంబందం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.   

 

సినిమా తర్వాత పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగేశ్వర రావు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ చూస్తే అనీల్ రావిపుడి నందమూరి బాలకృష్ణతో చేయాలనుకున్న రామారావు గారు సినిమా గుర్తుకు రాక మానదు. బాలయ్య 100వ సినిమా ఎవరితో చేద్దామన్న కన్ ఫ్యూజన్ లో ఉన్న టైం లో అప్పటికే హిట్లు కొడుతున్న అనీల్ రావిపుడి బాలకృష్ణను కలిసి ఓ కథ వినిపించాడు. ఆ సినిమాకు టైటిల్ గా 'రామారావు గారు' అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.  

 

బాలకృష్ణ ఎందుకో అనీల్ మీద అంత నమ్మకం పెట్టలేకపోయారు. 100వ సినిమాగా క్రిష్ డైరక్షన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేశారు. నాగ చైతన్య సినిమాకు నాగేశ్వర రావు పెట్టడంపై అనీల్ రావిపుడి స్పూర్తిగా తీసుకున్నట్టు ఉన్నారు. సేం టైటిల్ కాదు కాబట్టి అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. కాని అతని ఆలోచనని వాడుకున్నాడు కాబట్టి నాగేశ్వర రావు టైటిల్ వినగానే అనీల్ రావిపుడి షాక్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న నాగేశ్వర రావు సినిమాతో మరోసారి సూపర్ హిట్ పై దృష్టి పెట్టాడు డైరక్టర్ పరశురాం.

మరింత సమాచారం తెలుసుకోండి: