అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో బన్ని వాసు నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఒంగోలు గిత్త తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అఖిల్ కూడా తీసిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం వరుస స్టార్ అవకాశాలతో పూజా హెగ్దె ఫుల్ ఫాం లో ఉందని తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

లేటెస్ట్ గా సినిమా నుండి పూజా హెగ్దె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చిట్టి పొట్టి డ్రెస్సులేసుకుని క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక చెప్పినట్టుగా పూజా హెగ్దె క్యూట్, స్వీట్, హాట్ గా ఉందని చెప్పొచ్చు. ఈమధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్దె ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

 

ఈ సినిమాతో పాటుగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా నటిస్తుంది పూజా. అమ్మడి క్రేజ్ ఈ సినిమాకు యాడ్ అయ్యేలా ఉంది. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ప్రీ లుక్ లో షూస్ చూపించి ఫస్ట్ లుక్ లో అఖిల్ కు అసలు ఎలాంటి చెప్పులు లేకుండా చూపించిన భాస్కర్ ఈ సినిమాతో అతని కెరియర్ కూడా హిట్ ట్రాక్ ఎక్కించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పోస్టర్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: