కన్నడ పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భామ రష్మిక మందన్న. ఛలో నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే రష్మికకు తెలిసిన ఫార్ములా. ప్రస్తుతం నితిన్ తో కలిసి చేసిన భీష్మ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, రష్మికల హడావిడి బాగానే ఉంది. ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో తెరకెక్కిన భీష్మ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, రష్మికకు సంబందించిన ఓ టాప్ సీక్రెట్ బయట పెట్టాడు. మాములుగా మనం అందరం సాయంత్రం స్నాక్ ఐటెం గా టిఫెనో లేదో ఇంకోటో తింటాం కాని రష్మిక మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పాడు నితిన్. నితిన్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మాములుగా ఎలాంటి స్టఫ్ లేకపోతేనే ఆడేసుకునే గాసిప్ రాయుళ్లు రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పగానే వాళ్లకు మంచి స్టఫ్ దొరికినట్టు అయ్యింది.

 

రష్మిక చెప్పొద్దని ఎంత వారించినా సరే నితిన్ ఆమె కుక్క బిస్కెట్ల సీక్రెట్ రివీల్ చేశాడు. సరదాగా అన్నాడో లేక నిజంగానే అమ్మడికి అవి టేస్ట్ చేసే అలవాటు ఉందో కాని రష్మిక గురించి నితిన్ బయటపెట్టినా ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక ఫ్యాన్స్ ఒకటే డిస్కషన్ పెడుతున్నారు. భీష్మ తర్వాత సుకుమార్, బన్ని కాంబినేషన్ సినిమాకు ఓకే చెప్పిన రష్మిక ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబో మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో రష్మిక సూపర్ ఫామ్ లో ఉంది. అయితే పూజా హేగ్దే లేదంటే రష్మిక అన్నట్టుగా స్టార్ హీరోల సినిమాలు ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: