అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలు చేశారు.  ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు.  హలో సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది.  మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్న అఖిల్ కు కనీసం మాములు హీరోగా కూడా నిలబడలేకపోయారు.  అఖిల్ పై అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపెట్టుకున్నారు.  ఫైట్స్, స్టెప్స్ అన్ని ఒకే.  కానీ, హిట్ మాత్రం పలకరించడం లేదు.  అక్కినేని హీరో చైతు సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.  అఖిల్ మాత్రం నిలబడలేకపోతున్నాడు.

 
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.  ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.  అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా వస్తున్నది.  అల్లు అరవింద్ నిర్మాణం అంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనుకోవచ్చు.  బొమ్మరిల్లు, పరుగు సినిమా తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కు హిట్ లేదు.  


ఇంతకాలం తరువాత మరలా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఈసారైనా సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.  ఒకవేళ సినిమా హిట్ ఇస్తే కనుక అఖిల్ ఇండస్ట్రీలో నిలబడే ఛాన్స్ ఉంటుంది.  లేదంటే మాత్రం మరోసారి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.  మరి ఎలా ఏంటి అన్నది చూడాలి.  భాస్కర్ ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నారు.  అటు అఖిల్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే తప్పనిసరిగా హిట్ కొట్టాలి.  


చేసిన మూడు సినిమాలు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి.  ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ కొడితేనే అఖిల్ కు హెల్ప్ అవుతుంది.  అప్పుడే అఖిల్ ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు.  లేదంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.  మరి ఎలా చేస్తాడో చూడాలి.  ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకుంటున్న ఈ హీరోకు ఈ సినిమా లైఫ్ ఇస్తుందా... లేదంటే తేడా కొట్టి పక్కన ఉంచుతుందా అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా దొరుకుతుందో చూద్దాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: