తెలుగు సినిమా చరిత్ర గురించి ప్ర‌తాపం చూపించాల్సి  వస్తే నందమూరి ఫ్యామిలీ గురించి తప్పక ప్రస్తావించాలి. తెలుగు సినిమా ఏడు దశాబ్దాల చరిత్ర అయితే దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ ఎన్టీ రామారావు తో ప్రారంభిస్తే ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడిగా యువరత్న నందమూరి బాలకృష్ణ 1980వ దశకం నుంచి నేటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నారు. బాలకృష్ణ తర్వాత ఆయన మరో సోదరుడు హరికృష్ణ కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఇక ఎన్టీఆర్ కుటుంబంలో మూడో తరం వార‌సుడిగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ కొనసాగుతున్నారు. మధ్యలో నందమూరి తారక రత్న ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు.

 

ఇక ఇప్పుడు బాలకృష్ణ సీనియర్ హీరో అయిపోవడంతో నందమూరి కుటుంబం నుంచి భవిష్యత్ ఆశాకిరణంగా జూనియర్ ఎన్టీఆర్ కనబడుతున్నారు. కోట్లాదిమంది నందమూరి కుటుంబం అభిమానులు ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఎన్టీఆర్ ఒక్కడే ఆశాకిరణంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఆయనకు ఇప్పటికీ స్టార్ హీరో స్టేటస్ లేదు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు లేదో తెలియని పరిస్థితి. మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎప్పటికీ  చ‌ర్చ కొనసాగుతూనే ఉంది. సీనియర్ అవ్వడంతో ఇప్పటికీ ఆయన గతంతో పోలిస్తే చాలా వరకు సినిమాలు తగ్గాయి.  మరోవైపు మెగా కుటుంబం నుంచి ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి సరైన హీరో లేకపోవటం ఆ కుటుంబ వీరాభిమానుల తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులకు పెద్ద లోటే అని చెప్పాలి. ఎన్టీఆర్ మాత్రం తనదైన శైలితో ఆ లోటుని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇక ముందు ముందు చూడాలి మ‌రి బాల‌కృష్ణ త‌న‌యుడు ఏమ‌న్నా వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అన్న‌ది. ఇక బాల‌కృష్ణ కొడుకు గ‌నుక సీన్‌లోకి వ‌స్తే నంద‌మూరి ఫ్యాన్స్‌కి పండ‌గ‌నే చెప్పాలి. ఎప్ప‌టి నుంచో ఆయ‌న ఫ్యాన్స్ త‌న ఎంట్రీ కోసం క‌ళ్ళు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీని పై బాల‌య్య కాస్త స‌రైన నిర్ణ‌యం తీసుకుంటే బావుంటుంద‌ని ఫ్యాన్స్ అంద‌రూ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: