యాంగ్ టైగర్ ఎన్టీఆర్.. పేరుకే నందమూరి కుటుంబం.. పేరుకే సీనియర్ నటుడు మనవడు.. పేరుకే సీతయ్య హరి కృష్ణ కోడుకు.. అన్ని ఉన్న ఎన్టీఆర్ పడని కష్టం లేదు.. అన్ని కష్టాలు పడిన సరే అతనికంటూ ఓ అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు.. లెక్కపెట్టలేనంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 

 

అలాంటి ఈ ఎన్టీఆర్ కు ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు.. నిజానికి ఎన్టీఆర్ స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు.. అంతలా ప్రాణం ఇచ్చే స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజీవ్ కనకాలనే. అలాంటి రాజీవ్ కనకాలతో కలిసి దాదాపు అన్ని సినిమాల్లో నటించాడు.. అయితే కొన్ని సినిమాల్లో అతని క్యారెక్టర్ కు సంబంధించి పాత్రలు లేకపోవడంతో చెయ్యలేదు.. అంతే ఇక.. మీడియా అంత కూడా ఎన్టీఆర్ తో పెద్ద గొడవ అయ్యింది అని.. ఆ గొడవ కారణంగానే ఎన్టీఆర్ సినిమాల్లో నటించలేదు అని రాసుకుంటూ వచ్చాయి.. 

 

అయితే అప్పట్లో ఆ గొడవలపై రాజీవ్ కనకాల స్పందించి ''ఎన్టీఆర్‌తో నాకు స్నేహం చెడిందని రకరకాల వార్తలు పుట్టించారు. అసలు ఎన్టీఆర్‌కి నాకు మధ్య గ్యాప్ ఎప్పుడూ లేదు. అదే నిజమైతే మళ్లీ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు ఎందుకు చేస్తా.'' అనిప్రశ్నించారు .. అంతేకాదు.. వ్యక్తిగత పనుల కారణంగా వారు కొంత దూరం ఉండచ్చని.. వారు ఎప్పటికి మంచి స్నేహితులే అని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. అదే కదా స్నేహం అంటే.. 

 

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ఆంధ్ర రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్ పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అని.. మరి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: